Hair: పొట్టి జుట్టు పొడుగ్గా పెరగాలంటే ఈ ప్రోటీన్ ఆహారం తినాల్సిందే!!

భారతీయ వంటశాలలో చవకగా, సులభంగా లభించే కొన్ని ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాలు జుట్టును బలంగా, ఒత్తుగా మార్చుతుంది. జుట్టు ఆరోగ్యంగా, వేగంగా పెరగాలంటే ఆహారంలో చేర్చాల్సిన నాలుగు ప్రొటీన్ ఫుడ్స్ గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Hair

Hair

నేటి కాలంలో ప్రతి ఒక్కరూ పొడవాటి, దృఢమైన జుట్టును కోరుకుంటారు. జుట్టు పెరుగుదలలో ప్రొటీన్ (Protein) కీలక పాత్ర పోషిస్తుంది. జుట్టు ప్రధానంగా కెరాటిన్ (Keratin) అనే ప్రొటీన్‌తో తయారవుతుంది. కాబట్టి ఆహారంలో ప్రొటీన్ లోపం ఉంటే జుట్టు మూలాలకు తగిన పోషకాలు అందక, జుట్టు ఎదుగుదల ఆగిపోతుంది. జుట్టుకు మాస్క్‌లు, నూనెలు బయటి నుంచి సహాయపడతాయి. కానీ అసలైన ప్రభావం ఆహారం ద్వారా లోపలి నుంచే జరుగుతుంది. భారతీయ వంటశాలలో చవకగా, సులభంగా లభించే కొన్ని ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాలు జుట్టును సహజంగా బలంగా, ఒత్తుగా మార్చడానికి దోహదపడతాయి. జుట్టు ఆరోగ్యంగా, వేగంగా పెరగాలంటే ఆహారంలో తప్పక చేర్చాల్సిన నాలుగు అద్భుతమైన ప్రొటీన్ ఫుడ్స్ గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

జుట్టు పెరుగుదలకు తోడ్పడే ప్రొటీన్ ఫుడ్స్:

పనీర్ (Cottage Cheese): పనీర్ ప్రొటీన్‌కు పవర్‌హౌస్. కేవలం 100 గ్రాముల పనీర్‌లో దాదాపు 18 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ప్రొటీన్ బలహీనమైన జుట్టును రిపేర్ చేయగా, ఇందులో ఉండే కాల్షియం, విటమిన్ డి జుట్టు మూలాలను, ఫోలికల్స్‌ను బలోపేతం చేస్తాయి.

బాదం పప్పులు (Almonds): డ్రై ఫ్రూట్స్‌లో బాదం అద్భుతమైన ప్రొటీన్ మూలం. ప్రొటీన్‌తోపాటు విటమిన్ ఇ, మెగ్నీషియం ఇందులో ఉంటాయి. కేవలం 28 గ్రాముల బాదంలో సుమారు 6 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి, మెరుపును పెంచుతాయి. రాత్రి నానబెట్టి ఉదయం తీసుకోవడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: అద్భుతమైన అల్పాహారాలు.. కడుపు నిండుగా ఉంచే బెస్ట్ ఇవే

రాజ్‌మా/నట్స్ (Black Beans): ప్రొటీన్, జింక్, విటమిన్ బి6 పుష్కలంగా ఉండే నట్స్ జుట్టుకు చాలా మంచివి. 100 గ్రాముల వండిన నట్స్‌లో దాదాపు 9 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఇవి కెరాటిన్ ఉత్పత్తిని పెంచడానికి.. జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి.

గుమ్మడి గింజలు (Pumpkin Seeds): గుమ్మడి గింజలలో ప్రొటీన్, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని తినడం వల్ల జుట్టు పొడిబారడం, రాలడం తగ్గుతుంది. వీటిని స్నాక్స్‌గా లేదా సలాడ్స్‌లో కలుపుకుని తీసుకోవచ్చు. రోజువారీ ఆహారంలో ఈ ప్రొటీన్-రిచ్ ఫుడ్స్‌ను చేర్చుకోవడం ద్వారా జుట్టుకు పోషణ అందించి.. ఆరోగ్యకరమైన ఎదుగుదలను ప్రోత్సహించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
 
ఇది కూడా చదవండి: పండు ఒకటే కానీ ప్రయోజనాలు నాలుగు

Advertisment
తాజా కథనాలు