Protein: ప్రోటీన్ లోపాన్ని అధిగమించేందుకు సులభ మార్గాలు ఇవే

శరీరంలో ప్రోటీన్ లోపం ఏర్పడినప్పుడు నీరసం, బలహీనత పెరుగుతాయి. కండరాల నిర్మాణం, కణజాల మరమ్మత్తు, ఎముకలు, చర్మం, రక్తం ఆరోగ్యానికి ప్రోటీన్ చాలా అవసరం. ఫిట్‌గా ఉండాలన్నా, కండరాలు పెరగాలన్నా, బరువు తగ్గాలన్నా ఆహారంలో ప్రోటీన్‌ను చేర్చుకోవడం తప్పనిసరి.

New Update
Protein

Protein

నేటి కాలంలో ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే వ్యాయామంతోపాటు సమతుల్య ఆహారం చాలా ముఖ్యం. ముఖ్యంగా శరీరంలో ప్రోటీన్ లోపం ఏర్పడినప్పుడు నీరసం, బలహీనత పెరుగుతాయి. కండరాల నిర్మాణం, కణజాల మరమ్మత్తు, ఎముకలు, చర్మం, రక్తం ఆరోగ్యానికి ప్రోటీన్ చాలా అవసరం. ఫిట్‌గా ఉండాలన్నా, కండరాలు పెరగాలన్నా, బరువు తగ్గాలన్నా... ఆహారంలో ప్రోటీన్‌(protein-rich-vegetables)ను చేర్చుకోవడం తప్పనిసరి. ప్రోటీన్ లోపాన్ని అధిగమించడానికి రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన  ముఖ్య విషయాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

భోజనంలో ప్రోటీన్..

ప్రతి పూట ఆహారంలో కొవ్వు తక్కువగా ఉన్న ప్రోటీన్లను (protein-rich-foods) తీసుకోవాలి. చికెన్ బ్రెస్ట్, టర్కీ లేదా చేపలు వంటివి తక్కువ క్యాలరీలతో మంచి ప్రోటీన్‌ను అందిస్తాయి. శాఖాహారులు పప్పులు, శనగలు, క్వినోవా, టోఫు, ఎడమామే వంటివి తినవచ్చు. సలాడ్‌లు, సూప్‌లలో పప్పులు, బీన్స్ కలుపుకోవడం వల్ల ప్రోటీన్ అవసరాలు సులభంగా తీరుతాయి. ఆకలిగా ఉన్నప్పుడు గ్రీక్ యోగర్ట్, నట్స్, విత్తనాలు లేదా ఉడకబెట్టిన గుడ్లు వంటివి తినాలి. ఈ స్నాక్స్‌ ఆరోగ్యకరమైనవి, ప్రోటీన్‌తో నిండి ఉంటాయి. కొద్దిగా పనీర్ (Cottage Cheese) లేదా గుప్పెడు బాదం గింజలు శక్తిని ఇచ్చి, ఆకలిని అదుపు చేస్తాయి. గుడ్లు చవకైన, సులభమైన ప్రోటీన్(protein rich dry fruits) వనరు. పెద్ద గుడ్డులో సుమారు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వాటిని ఉడకబెట్టినా, ఆమ్లెట్‌గా వేసుకున్నా లేదా పోచ్ చేసినా... అది ఆహారంలో ప్రోటీన్‌ను సులభంగా పెంచుతుంది. 

ఇది కూడా చదవండి: ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఏ గింజ దేనికి మంచిదో తెలుసా?

పాలు, పెరుగు, జున్ను  ప్రోటీన్, కాల్షియంకు మంచి వనరులు. ముఖ్యంగా గ్రీక్ యోగర్ట్‌లో ప్రతి సర్వింగ్‌లో 10-12 గ్రాముల వరకు ప్రోటీన్ లభిస్తుంది. రోజూ గ్లాసు పాలు తాగడం లేదా స్మూతీలో పెరుగు కలుపుకోవడం ద్వారా ఎముకలు బలంగా తయారవుతాయి. ఆహారం ద్వారా తగినంత ప్రోటీన్ తీసుకోలేకపోతుంటే.. వే ప్రోటీన్ (Whey Protein), కేసిన్ (Casein) లేదా మొక్కల ఆధారిత ప్రోటీన్ పౌడర్‌ను స్మూతీలలో, షేక్స్‌లో కలుపుకోవచ్చు. శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారికి ఇది ముఖ్యంగా ప్రయోజనకరం. సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలితో ఈ ప్రోటీన్ రిచ్ ఆహారాన్ని కలిపి తీసుకోవడం ద్వారా పూర్తి ఆరోగ్యంగా, దృఢంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
 
ఇది కూడా చదవండి: జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగాలంటే.. ఈ డ్రై ఫ్రూట్స్ తినండి!!

Advertisment
తాజా కథనాలు