Dry Fruits And Hair: జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగాలంటే.. ఈ డ్రై ఫ్రూట్స్ తినండి!!

డ్రై ఫ్రూట్స్‌లో ఐరన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని తగ్గించి, మెరిసే ఆరోగ్యకరమైన జుట్టును అందిస్తాయి. ఇవి ఆహారంలో చేర్చుకుంటే జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.

New Update
Dry fruits and hair

Dry Fruits And Hair

ఈ రోజుల్లో ఒత్తిడి, కాలుష్యం, సరి కాని ఆహారపు అలవాట్ల(food habits) కారణంగా చాలా మంది జుట్టు రాలడం, చిట్లడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఆహారంలో చిన్నపాటి మార్పులు(best-health-tips) చేసుకోవడం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీనికి డ్రై ఫ్రూట్స్(dry fruits) ఒక సులభమైన, ప్రభావవంతమైన పరిష్కారం. ఎండు పండ్లలో ఐరన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని తగ్గించి, మెరిసే ఆరోగ్యకరమైన జుట్టును అందిస్తాయి. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడే కొన్ని ముఖ్యమైన డ్రై ఫ్రూట్స్ గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

బాదం (Almonds): 

విటమిన్ ఇ అధికంగా ఉండే బాదం తల చర్మంలో రక్త ప్రసరణను పెంచుతుంది. దీని ద్వారా జుట్టు మూలాలకు సరైన పోషకాలు, ఆక్సిజన్ అంది జుట్టు బలంగా, పొడవుగా పెరుగుతుంది. రాత్రంతా నానబెట్టి ఉదయం తింటే మరింత మంచిది.

జీడిపప్పు (Cashews): 

ఐరన్, జింక్ జీడిపప్పులో ఎక్కువగా ఉంటాయి. ఐరన్ ఆక్సిజన్‌ను స్కాల్ప్‌కు చేర్చగా, జింక్ జుట్టు మూలాలను బలోపేతం చేసి జుట్టు చిట్లిపోకుండా నిరోధిస్తుంది. జుట్టు పల్చబడడం లేదా రాలడం ఉన్నవారికి ఇది చాలా మంచిది.

వాల్‌నట్స్ (Walnuts):

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, బయోటిన్, విటమిన్ ఇ పుష్కలంగా ఉండే వాల్‌నట్స్ జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తాయి. ఇవి స్కాల్ప్ వాపును తగ్గించి.. వెంట్రుకల కుదుళ్లు సరిగ్గా పనిచేయడానికి తోడ్పడతాయి. వీటిని స్నాక్స్‌గా, పెరుగులో కలుపుకుని తినవచ్చు.

ఇది కూడా చదవండి: పొట్టి జుట్టు పొడుగ్గా పెరగాలంటే ఈ ప్రోటీన్ ఆహారం తినాల్సిందే!!

ఖర్జూరాలు (Dates):

ఐరన్, ఫైబర్, సహజ చక్కెరలు ఉన్న ఖర్జూరాలు జుట్టు మూలాలకు శక్తిని అందించి.. జుట్టు పల్చబడకుండా నిరోధిస్తాయి.

ఎండుద్రాక్ష (Raisins): 

చిన్నదైనా ఎండుద్రాక్షలో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, కాలుష్యం వల్ల కలిగే నష్టం నుంచి జుట్టును రక్షిస్తాయి. వీటిని కూడా నానబెట్టి తింటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

పిస్తా (Pistachios):

పిస్తాలో ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ బి6 ఉంటాయి. ఇవి స్కాల్ప్‌ను పోషించి, జుట్టును హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. పొడిగా, నిర్జీవంగా ఉండే జుట్టు ఉన్నవారు వీటిని సాయంత్రం స్నాక్స్‌గా తీసుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారంతోపాటు ఈ ఎండు పండ్లను తీసుకోవడం ద్వారా జుట్టు రాలడం సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
 
ఇది కూడా చదవండి:ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఏ గింజ దేనికి మంచిదో తెలుసా?

Advertisment
తాజా కథనాలు