Seeds Benefits: ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఏ గింజ దేనికి మంచిదో తెలుసా?

చిన్న పరిమాణంలోనే అధిక పోషకాలను కలిగి ఉండే ఈ డ్రై ఫ్రూట్స్, విత్తనాలు ఆరోగ్యకరమైన జీవనశైలిలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ముఖ్యమైన ఆహారాలు. ఇవి ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

New Update
Pumpkin Seeds

Pumpkin Seeds

డ్రై ఫ్రూట్స్(dry fruits), విత్తనాలు పోషకాల గని. ఇవి ప్రకృతి మనకు అందించిన అద్భుతమైన ఆరోగ్య ప్రదాయినులు. బాదం, జీడిపప్పు, వాల్‌నట్‌లు వంటి డ్రై ఫ్రూట్స్, గుమ్మడి గింజలు, చియా గింజలు వంటి విత్తనాలు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాల అపారమైన వనరులు. వీటిని రోజూ తీసుకోవడం వలన తక్షణ శక్తి లభించడమే కాక.. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చిన్న పరిమాణంలోనే అధిక పోషకాలను కలిగి ఉండే ఈ డ్రై ఫ్రూట్స్, విత్తనాలు ఆరోగ్యకరమైన జీవనశైలి(healthy life style) లో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ముఖ్యమైన ఆహారాలు. ఇవి రుచిని, ఆరోగ్యాన్ని ఏకకాలంలో అందిస్తాయి. అయితే చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ విత్తనాలు (Seeds) పోషకాల గని. వీటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని(human-life-style) మెరుగుపరుచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. డాక్టర్ల తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని ముఖ్యమైన విత్తనాలు, వాటి ప్రయోజనాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

జీర్ణక్రియకు సోంపు (Anise):

సోంపులో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపును శుభ్రం చేయడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. గ్యాస్, మలబద్ధకం వంటి పొట్ట సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

అవిసె గింజలు (Flaxseeds):

ముఖ్యంగా మహిళలకు అవిసె గింజలు ఒక వరం. ఇవి రుతుస్రావం, మెనోపాజ్ సమయంలో హార్మోన్ల హెచ్చుతగ్గులను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి.

చియా గింజలు (Chia seeds):

చియా గింజలు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలకు గొప్ప మూలం. ఇవి గుండె, మెదడు ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరం. ఇవి కణాలను బలోపేతం చేసి జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయి.

గుమ్మడి గింజలు (Pumpkin Seeds):

గుమ్మడి గింజలు శరీరానికి బలాన్ని, శక్తిని అందిస్తాయి. వీటిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల అలసట తగ్గి రోజంతా శక్తివంతంగా ఉండొచ్చు.

మెంతులు (Fenugreek Seeds):

మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులకు మరియు ఇన్సులిన్ స్థాయిలను సమతుల్యం చేయడానికి చాలా మంచివిగా పరిగణించబడతాయి.

నువ్వులు (Sesame seeds):

నువ్వులలో కాల్షియం, ఇతర ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేసి కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఈ విత్తనాలను రోజువారీ ఆహారంలో సులభంగా చేర్చుకోవచ్చు. స్మూతీలు, పప్పులు, చిరుతిళ్లలో కలుపుకొని తినవచ్చు. చిన్న విత్తనాల శక్తిని గ్రహించి ఆరోగ్యకరమైన జీవనశైలిని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనికఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
 
ఇది కూడా చదవండి: నిమ్మకాయ నీరు వల్ల ప్రయోజనాలే కాదు హాని కూడా కలుగుతుందని తెలుసా!!

Advertisment
తాజా కథనాలు