Iran-Isreal War: ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. ఆకాశాన్ని తాకుతున్న డ్రై ఫ్రూట్స్ ధరలు
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా డ్రై ఫ్రూట్స్ సరఫరా ఆగిపోయింది. దీని కారణంగా ఢిల్లీ హోల్సేల్ మార్కెట్లలో డ్రై ఫ్రూట్స్ ధరలు ఐదు నుంచి పది రెట్లు పెరిగాయి. ఇరాన్ నుంచి ఖర్జూరం, మమ్రా బాదం, పిస్తాపప్పులు వంటి డ్రైఫ్రూట్లను భారత్ దిగుమతి చేసుకుంటుంది.