/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Black-grapes-are-very-good-for-health-jpg.webp)
Grapes Photograph: (Grapes)
Grapes Health Benefits: రుచిగా ఉండే ద్రాక్ష పండ్లను చాలా మంది ఇష్టపడతారు. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ద్రాక్ష పండ్లు అనేక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పొటాషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, సెలీనియం వంటి పోషకాలు(Nutrients) పుష్కలంగా ఉన్నాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
ఇది కూడా చూడండి: Dengue: బొప్పాయి ఆకులు నిజంగానే ప్లేట్లెట్స్ ను పెంచుతాయా? సైన్స్ ఏం చెబుతోంది?
గుండె పోటు వచ్చే ప్రమాదాల నుంచి..
ద్రాక్షలోని ఫైబర్(Fiber) మలబద్ధకం(Constipation) వంటి సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది. రోజులో ఉదయం పూట ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం వల్ల బాడీ హైడ్రేట్(Hydrated)గా ఉంటుంది. నల్ల ద్రాక్ష(Black Grape) రసాన్ని డైలీ తాగడం వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదాలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిలోని ఆస్పిరిన్ రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది.
ఇది కూడా చూడండి: Health Tips: తల దురద కేవలం చుండ్రు వల్లే కాదు..ఇన్ఫెక్షన్ కూడా కావచ్చు
ద్రాక్ష ఆస్తమా రోగులకు కూడా మేలు చేస్తుంది. ఇందులోని పోషకాలు ఆస్తమా వచ్చే అవకాశాన్ని కూడా తగ్గిస్తుంది. కొందరు మైగ్రేన్ నొప్పితో ఎక్కువగా బాధపడుతుంటారు. అలాంటి వారు డైలీ ద్రాక్ష రసం తీసుకోవడం వల్ల నొప్పి నుంచి విముక్తి చెందుతారు. అలాగే ద్రాక్ష వల్ల కంటి చూపు కూడా పెరుగుతుంది. డైలీ వీటిని తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముడతలు, వృద్ధాప్యం రాకుండా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి:Papaya Side Effects: వీరు పొరపాటున బొప్పాయి తింటే.. సమస్య పెరగడం ఖాయం
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Air Pollution: వాయు కాలుష్యంతో చిన్నపిల్లల్లో బ్రెయిన్ సమస్యలు .. తాజా అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు !
Follow Us