/rtv/media/media_files/2024/10/20/m7GKcGsOOQONWQck5dJp.jpg)
డెంగీ బారిన పడినప్పుడు ప్లేట్లేట్ కౌంట్ బాగా తగ్గిపోతుంది. సగటు మనషికి ప్లేట్ లేట్ కౌంట్ 1,50,000 నుంచి 4,50,000 వరకు ఉంటుంది. డెంగీ ఇన్ఫెక్షన్ వల్ల కొంతమందిలో ప్లేట్లెట్ కౌంట్ లక్ష నుంచి 50 వేల కంటే తక్కువకు కూడా పడిపోతుంది.
/rtv/media/media_files/viral-fever11.jpg)
ఈ పరిస్థితుల్లో ప్లేట్లేట్ కౌంట్‌ను పెంచడం కోసం బొప్పాయిని అదేపనిగా తింటుంటారు. దీనిలోని పైపైన్ అనే ఎంజైమ్ ద్వారా ప్లేట్ లెట్ కౌంట్ పెరుగుతుందని నమ్ముతారు.
/rtv/media/media_files/2025/01/26/papayaseeds3.jpeg)
అయితే సైన్స్ ప్రకారం ఇది కేవలం అపోహ మాత్రమే. అలా అని కివి, డ్రాగన్ ఫ్రూట్ వంటివి తింటే ప్లేట్లెట్స్ పెరుగుతాయి అనే దాంట్లో కూడా ఆధారం లేదు. వాస్తవానికి ఆ సమయంలో రోగికి అన్ని రకాల పండ్లు, పోషకాలు అవసరం.
/rtv/media/media_files/DO7Tnd5mXsMtRkWmnQKQ.jpg)
డెంగీ జ్వరం సమయంలో మేకపాలు, బొప్పాయి ఆకులు హాని కలిగిస్తాయన్ని చాలా మంది డాక్టర్లు చెబుతున్న మాట. అయితే డెంగీ సమయంలో రోగికి బలహీనమైన జీర్ణ ప్రక్రియ ఉంటుంది. అందువల్ల బొప్పాయి, పాలు అజీర్ణ సమస్యలను కలిగించే అవకాశం ఉంది.
/rtv/media/media_files/viral-fever44.jpg)
అంతేకాదు ఇవి శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యతను మరింత దెబ్బతీస్తాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/fever-8-scaled.jpg)
డెంగీకి సంబంధించి మరో అపోహ కూడా ఉంది. వృద్ధులు, పిల్లలు, మహిళలను మాత్రమే దీనికి ఎక్కువగా ప్రభావితం అవుతారని నమ్ముతుంటారు.
/rtv/media/media_files/viral-fever99.jpg)
ఇది ఏ మాత్రం నిజం కాదు. రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న ఎవరితోనైనా ఈ వ్యాధి సంభవించే అవకాశం ఉంటుంది. జ్వరం సమయంలో పౌష్టికమైన ఆహరం, పండ్లు కూరగాయలు తీసుకోవడం దీనికి సరైన మార్గం.
/rtv/media/media_files/viral-fever88.jpg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.