/rtv/media/media_files/2025/05/14/DTQQvcLiatr1VviiSFvU.jpg)
elephant walking exercise
Elephant Walk: ఈ ఆధునిక యుగంలో నిశ్చల జీవనశైలి, తక్కువ శారీరక చురుకుదనం, అధిక ప్రాసెస్ ఆహారపు అలవాట్లు ప్రతి వ్యక్తి ఊబకాయానికి గురి అవుతున్నారు. అధిక బరువు శరీర ఆకృతితోపాటు ఆనారోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. వీటిల్లో శ్వాస సంబంధిత సమస్యలు, రక్తపోటు, డయాబెటిస్ వంటి అనేక వ్యాధులు ఉన్నాయి. అయితే వీటికి పరిష్కారంగా ఏనుగు నడక ప్రభావవంతమైన వ్యాయామం. దీనిని దినచర్యలో చేర్చుకుంటే శరీరం చురుగ్గా, మానసిక స్థితి మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read : భారత్--పాక్ వివాదంలోకి RCB ప్లేయర్.. ఈ ఆస్ట్రేలియన్ ఏమన్నాడంటే!
నెగెటివ్ ప్రభావాలను తగ్గించుకోవచ్చు:
ఏనుగు నడకను హాతీ చల్ అని కూడా పిలుస్తారు. ఇది ముందుకు వంగి చేతులను నేలపై ఉంచి కాళ్లను పక్కలకు సాగదీస్తూ నెమ్మదిగా నడిచే వ్యాయామం. ఈ వ్యాయామం వెన్నెముక, వీపు, మెడకు మృదువైన సాగతీతను ఇస్తుంది. దీనివల్ల వెన్నెముకకు మేలు జరుగుతుంది. దీని ఫలితంగా శరీర భంగిమ కూడా మెరుగవుతుంది. దీర్ఘకాలం కూర్చుని పనిచేసే వారు ఈ వ్యాయామం చేస్తే నొప్పులు, నెగెటివ్ ప్రభావాలను తగ్గించుకోవచ్చు. ఈ నడక తుంటి కండరాలు, మోకాలు, చీలమండల చురుకుదనానికి, శరీరాన్ని గాయాలకు గురి కాకుండా రక్షిస్తుంది. అంతేకాకుండా జీవక్రియను వేగవంతం చేసి శరీరంలోని కొవ్వు, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
ఇది కూడా చదవండి: ఏపీలో విషాదం.. చెరువులో పడి ముగ్గురు మృతి.. మరో ఇద్దరి కోసం గాలింపు
ఎలిఫెంట్ వాక్ రక్త ప్రసరణను మెరుగుపరిచి శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ సరఫరాను చేస్తుంది. దీనివల్ల కండరాల రికవరీ వేగవంతంగా, పనితీరు మెరుగా జరుగుతుంది. ఇది మానసికంగా కూడా అనేక ప్రయోజనాలు అందిస్తుంది. ఒత్తిడి తగ్గించి, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఎలిఫెంట్ వాక్ చేయడం వల్ల ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే ప్రభావాలను తగ్గించుకోవచ్చు. ఈ వ్యాయామం చేయాలంటే నెమ్మదిగా ముందుకు వంగి చేతులను నేలపై ఉంచాలి. ఆపై మోకాళ్లను ప్రత్యామ్నాయంగా వంచుతూ నడవాలి. రోజుకు 15 నుంచి 20 సార్లు చేస్తే శరీరానికి దీర్ఘకాలిక లాభాలు ఉంటాయి. ఎలిఫెంట్ వాక్‌ను జీవనశైలిలో భాగంగా చేసుకుంటే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన నిపుణులు చెబుతున్నారు.
Also Read : జియో మామ సూపరెహే.. రూ.100కే 90 రోజుల వ్యాలిడిటీ.. 5GB డేటా!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఆహారంపై నిమ్మరసం ఎందుకు వెసుకుంటారో తెలుసా..? ఆరోగ్య రహస్యం ఇదే
( daily-walk | exercise | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )