AP Crime: ఏపీలో విషాదం.. చెరువులో పడి ముగ్గురు మృతి.. మరో ఇద్దరి కోసం గాలింపు

ఏలూరు జిల్లా భీమడోలు మండలం కోమటిగుంట చెరువులో ప్రమాదవశాత్తు పడి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.  మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి వెలికితీశారు. ఇంకా గల్లంతైన ఇద్దరి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

New Update
హైదరాబాదులో దారుణం.. మహిళను కారుతో ఢీ కొట్టి..!

AP Crime: ఏలూరు జిల్లా భీమడోలు మండలంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కోమటిగుంట చెరువులో ప్రమాదవశాత్తు పడిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి వెలికితీశారు. అయితే.. ఇంకా గల్లంతైన ఇద్దరిని వెతికే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

Also Read :  నీ భూమి కబ్జా చేస్తే ఆ బాధ తెలుస్తుంది.. CI పై రంగనాథ్ ఫైర్!

చెరువులో పడి..

వివరాల్లోకి వెళితే.. భీమడోలు ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఓ వేడుకకు హాజరై తిరిగి వస్తున్న మార్గమధ్యంలో కాలకృత్యాల నిమిత్తం చెరువు వద్దకు వెళ్లారు. అదే సమయంలో ప్రమాదవశాత్తు వారు జారి చెరువులో పడిపోయారు. వర్షాల కారణంగా చెరువులో నీటి మట్టం పెరిగి ఉండడం, మట్టి వానల వల్ల భూమి తడిగా మారి ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. పడిపోయినవారిలో ముగ్గురి మృతదేహాలు బయటపడగా.. మిగిలిన ఇద్దరు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఇది కూడా చదవండి: ఆహారంపై నిమ్మరసం ఎందుకు వెసుకుంటారో తెలుసా..? ఆరోగ్య రహస్యం ఇదే

ప్రమాద విషయం తెలిసిన వెంటనే.. భీమడోలు నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు. స్థానికులు కూడా సహకారం అందించారు. కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని కన్నీటితో విలపిస్తున్నారు. మృతి చెందిన వారు యువకులు కావడం మరింత బాధాకరంగా మారింది. ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు పెరుగుతున్నాయి. నిన్న కడప జిల్లా మల్లేపల్లిలో ఈతకు వెళ్లిన ఐదుగురు చిన్నారులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. వరుసగా దుర్ఘటనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. నీటి ప్రాంతాలకు సమీపంలోకి వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: కొత్తిమీర కాడల నీటితో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Also Read :  బయటపడ్డ టర్కీ మరో కుట్ర.. పాక్‌తో కలిసి ఏం చేసిందంటే?



( ap crime updates | ap-crime-news | ap crime latest updates | latest-news)

Advertisment
Advertisment
తాజా కథనాలు