/rtv/media/media_files/2025/05/14/gvVo5eSjUxbUTU4epHgk.jpg)
Lemon on biryani
Lemon: నిత్య జీవితంలో మనం తీసుకునే ఆహారంలో చిన్న మార్పులతోనే ఆరోగ్యానికి పెద్ద మార్పులు సాధ్యమవుతాయి. అటువంటి వాటిల్లో నిమ్మకాయ ఒకటి. బిర్యాని, కొన్ని కూరలపై నిమ్మరసం పిండుకుంటారు. ఇలా చేస్తే ఆహార రుచితోపాటు ఆరోగ్యం మెరుగు పడుతుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, సిట్రిక్ ఆమ్లం లాంటి పోషకాలు శరీరాన్ని లోపల నుంచి శుద్ధి చేస్తాయి. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ ఆమ్లం జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ఉత్తేజితం చేసి ఆహారాన్ని తేలికగా జీర్ణం చేస్తుంది.
Also Read : మోహన్ లాల్ సస్పెన్స్ థ్రిల్లర్ 'థుడారమ్' ఓటీటీ రిలీజ్ పై కీలక అప్డేట్
విషపదార్థాలు బయటకు వెళ్లి..
పప్పులు, కూరగాయలు తింటే కొంతమందికి కడుపునొప్పి, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమయంలో నిమ్మరసం కలిపి తింటే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది గ్యాస్, కడుపులో భారం వంటి సమస్యలను తగ్గిస్తుంది. శరీరాన్ని డిటాక్స్ చేయడంలో నిమ్మకాయ సహకారం ఎక్కువగా ఉంటుంది. నిత్యం పప్పు, కూరగాయలలో కొద్దిగా నిమ్మరసం కలిపి తింటే శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లి శరీరం శుభ్రంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: లిచీ పండుతో బోలెడు లాభాలు.. ఓ లుక్కేయండి!
దీనివల్ల చర్మం ఆరోగ్యంగా, శరీరానికి ఉల్లాసంగా అనిపిస్తుంది. అలసట తగ్గి శక్తి స్థాయిలను పెంచుతుంది.నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంది. తక్కువ రక్తహీనత ఉన్నవారు ఇది మేలు చేస్తుంది. ఇది రుచితోపాటు శరీరాన్ని శుద్ధి చేయడం, జీర్ణక్రియ మెరుగుపరచడం, రోగనిరోధక శక్తి పెంచుతుంది. నిమ్మకాయను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: కాకోలాట్ జలపాతం.. ప్రకృతి ప్రేమికుల కోసం ఓ దివ్యధామం
Also Read : పాకిస్థాన్ నుంచి తిరిగొచ్చిన భర్త.. గుర్తుపట్టలేకపోయానంటూ భార్య ఎమోషనల్
( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )