/rtv/media/media_files/2025/05/14/ssqd3I9i0BDgIRt609X7.jpg)
Josh Hazelwood shocking post on India-Pak war
IND-PAK WAR: భారత్-పాక్ వార్ ఎఫెక్ట్ క్రికెటర్లపై పడుతోంది. ఇప్పటికే భారత క్రికెటర్లు ఇండియాకు మద్దతు తెలుపుతూ పోస్టులు పెట్టగా విశేష స్పందన లభించింది. అయితే ప్రస్తుతం ఐపీఎల్ లో RCB తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హజెల్‌వుడ్ సైతం భారత్‌కు అనుకూలంగా, పాక్‌కు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది.
Also Read : ‘అత్తా మీ కూతుర్ని చంపేశా’.. HYDలో భార్య గొంతు నులిమి, గాజుతో కోసి కిరాతకంగా చంపిన భర్త!
Also Read : ఆరోగ్యానికి మేలి చెసే ఏనుగు నడక వ్యాయామం
Josh Hazelwood shocking post
ఈ మేరకు ‘మీ పోరాటం ఇండియా కోసమే కాదు.. సురక్షితమైన ప్రపంచం కోసం’ అంటూ హజెల్ వుడ్ ఫుల్ సపోర్టు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న క్రికెట్ లవర్స్ దీనిని విపరీతంగా షేర్ చేశారు. ఇది కాస్త తన కంటపడగానే షాక్ అయిన హజెల్ వుడ్.. అయోమయానికి గురయ్యాడు. వెంటనే తన టీమ్ ను అలర్ట్ చేయడంతో దీనిపై వారు క్లారిటీ ఇచ్చారు.
Also Read: క్రిస్టియానో రొనాల్డో కొడుకొచ్చాడు.. ఫుట్‌బాల్ ఎంట్రీ అదిరిపోయింది
'ఐపీఎల్ వాయిదా పడటంతో WTC మ్యాచ్ కోసం హజెల్ వుడ్ ఆస్ట్రేలియా బయలుదేరాడు. అయితే భారత్, పాక్ యుద్ధంపై అతడు స్పందించినట్లు వైరల్ అవుతున్న పోస్ట్ ఫేక్. ఆయనకు ఎక్స్, ఇన్‌స్టా, ఫెస్ బుక్ వంటి ఎలాంటి అధికారిక సోషల్‌మీడియా అకౌంట్స్ లేవు' అని స్పష్టం చేసింది. మరోవైపు ఆర్సీబీ కూడా వెంటనే స్పందించి ఆ పోస్ట్ డిలీట్ చేయించింది.
Also Read : హాస్పిటల్ డ్రామా మళ్ళీ మొదలు .. 'హార్ట్ బీట్' సీజన్ 2 వచ్చేస్తోంది!
ఇదిలా ఉంటే.. విరాట్ రిటైర్మెంట్ పై హజెల్ వుడ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. 'మైదానంలో పోరాటం నుంచి దాని వెలుపల పరస్పర గౌరవం వరకు.. దిగ్గజానికి వీడ్కోలు. థాంక్యూ లెజెండ్. ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్!' అంటూ రాసుకొచ్చాడు.
josh-hazlewood | ipl | ind pak war | telugu-news | today telugu news