/rtv/media/media_files/2025/04/14/bik20NIxotl3xlnRj7G8.jpg)
jio cheapest recharge plan
జియో వినియోగదారులకు కంపెనీ అదిరిపోయే సర్‌ప్రైజ్ అందించింది. తక్కువ బడ్జెట్‌లో మంచి రీఛార్జ్ ప్లాన్ కోసం ఎదురుచూస్తున్న వారికి జియో నెట్‌వర్క్ బిగ్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ గురించి తెలిస్తే వెంటనే రీఛార్జ్ చేసేస్తారు. జియో యూజర్లకు ఇది ఒక గొప్ప అవకాశం. అవును నిజమే.. అతి తక్కువ ధరలో అద్భుతమైన బెనిఫిట్స్‌ను కంపెనీ అందిస్తోంది. కేవలం రూ.100లతో రీఛార్జ్ చేసుకుంటే అదిరిపోయే ప్రయోజనాలను పొందుతారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Also Read: క్రిస్టియానో రొనాల్డో కొడుకొచ్చాడు.. ఫుట్‌బాల్ ఎంట్రీ అదిరిపోయింది
రూ.100 ప్లాన్
జియో కొత్తగా రూ.100 రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇది కేవలం డేటా ప్లాన్ మాత్రమే. ఇందులో కాలింగ్, SMS సౌకర్యాలు ఉండవు. ఇది జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. దీని కోసం వినియోగదారులకు బేస్ ప్లాన్ అవసరం. ఈ ప్లాన్‌లో వినియోగదారులు 5GB డేటాను పొందుతారు. దీని పరిమితి అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64 Kbps కి తగ్గుతుంది. దీనిలో 90 రోజుల Jio Hostar సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. అంటే జియో హాట్‌స్టార్‌లో వచ్చే కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లను ఫ్రీగా చూడొచ్చు. ఈ ప్లాన్ జియో అధికారిక వెబ్‌సైట్‌లో ఉంది.
Also Read: ఏపీలో ఘోర విషాదం.. ఈతకు వెళ్లిన చిన్నారులు గల్లంతు.. లభించని ఆచూకీ!
రూ.149 జియో సినిమా ప్లాన్
జియో హాట్‌స్టార్ రెగ్యులర్ ప్లాన్ విషయానికొస్తే.. ఇందులో రూ.149 ప్లాన్ ఉంది. ఈ ప్లాన్‌లో 90 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే పరిమిత ఫోన్ యాక్సెస్ అందించారు. ఈ ప్లాన్‌లో వినియోగదారులు రాబోయే IPL 2025 వంటి వెబ్ సిరీస్‌లు, సినిమాలు, లైవ్ స్పోర్ట్స్‌ను స్ట్రీమింగ్ చేసే సౌకర్యాన్ని పొందుతారు. వీటిని 1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలలో చూడవచ్చు. వీటితో పాటు రూ.195 ప్లాన్ ఉంది. ఈ ప్లాన్‌లో 15GB డేటా ఇస్తున్నారు. 90 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌లో జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు.
Also Read: రౌడీ స్టార్ ఫ్యాన్సీ కి బ్యాడ్ న్యూస్.. 'కింగ్ డమ్' రిలీజ్ లేదు!
jio recharge offers | jio-recharge-plan | latest-telugu-news | telugu-news
Also Read: కడపలో కలకలం.. బార్డర్‌కి వెళ్లిన ఆర్మీ ఉద్యోగి మిస్సింగ్..!