/rtv/media/media_files/2025/10/27/dark-spots-on-private-parts-2025-10-27-08-57-20.jpg)
Dark Spots Private Parts
శరీరంలోని కొన్ని సున్నితమైన భాగాల చర్మం నల్లబడటం (Darkening of Private Parts) అనేది చాలా మంది మహిళల్లో సాధారణంగా కనిపించే సమస్య. ముఖ్యంగా ఉష్ణోగ్రత, దుమ్ము, చెమట కారణంగా అండర్ ఆర్మ్స్, తొడలు, ప్రైవేట్ పార్ట్స్ పైభాగంలో ఈ నలుపు ఏర్పడుతుంది. ఈ నలుపు కారణంగా కొంతమందిలో ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. ఈ సమస్యకు చాలా మంది రసాయన క్రీములు లేదా చికిత్సలను ఉపయోగిస్తారు. కానీ ఇది ప్రయోజనం కంటే ఎక్కువ హాని చేస్తుంది. దీనికి బదులుగా సహజమైన, చవకైన మార్గాలను ఉపయోగించవచ్చు. వైద్య నిపుణుడు సూచించిన ఒక ప్రభావవంతమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి. వాటి గురించి కొన్ని విషయాలు ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
డార్క్ స్కిన్ కోసం..
ముల్తానీ మట్టి (multani-mitti): డాక్టర్ల అభిప్రాయం ప్రకారం.. ప్రైవేట్ పార్ట్స్ చుట్టూ ఉన్న చర్మం నలుపును తొలగించడానికి ముల్తానీ మట్టి (Fuller's Earth) చాలా సులభమైన, ప్రభావవంతమైన పరిష్కారం. కొద్దిగా ముల్తానీ మట్టిని తీసుకోవాలి. అందులో కొద్దిగా నీటిని కలిపి మెత్తని పేస్ట్‌లా తయారు చేయాలి. ఈ పేస్ట్‌ను ప్రైవేట్ పార్ట్స్ చుట్టూ ఉన్న చర్మంపై ప్రతిరోజూ రాయాలి. ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ పద్ధతిని నిరంతరంగా ఒక వారం పాటు పాటిస్తే.. మీరే తేడాను గమనించవచ్చు. క్రమంగా చర్మం రంగు తేలికపడి.. సహజంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ముల్తానీ మట్టి కేవలం ప్రైవేట్ పార్ట్స్ పైన మాత్రమే కాదు.. తొడలు, అండర్ ఆర్మ్స్, మోచేతుల (dark-spots) వంటి ఇతర ప్రాంతాలలో కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ ప్రాంతాలలో పదేపదే రాపిడి, చెమట కారణంగా చర్మం నల్లగా మారుతుంది.
ఇది కూడా చదవండి: ఉదయం ఈ ఆకు టీ తాగితే బరువు పరార్.. దీన్ని ఎలా తీసుకోవాలో తెలుసుకోండి!!
ముల్తానీ మట్టిని ప్రతిరోజూ రాయడం వలన ఈ ప్రాంతాలలో చర్మం శుభ్రంగా, మృదువుగా, తాజాగా మారుతుంది. అయితే మీరు ముల్తానీ మట్టి అందుబాటులో లేకపోతే.. ఈ సులభమైన ఇంటి చిట్కాను కూడా ప్రయత్నించవచ్చు. పసుపు- దోసకాయ (Turmeric and Cucumber) పేస్ట్‌ను ఉపయోగించాలి. పసుపు చర్మం వర్ణద్రవ్యాన్ని (Pigmentation) తగ్గిస్తుంది, సహజమైన కాంతిని ఇస్తుంది. మరోవైపు దోసకాయ చర్మాన్ని చల్లబరుస్తుంది, మృదువుగా చేస్తుంది. అయితే ప్రైవేట్ పార్ట్స్ వద్ద చర్మం నల్లబడటం అనేది ఆందోళన చెందాల్సిన విషయం కాదు. ఇది సాధారణంగా హార్మోన్ల మార్పులు లేదా రాపిడి వలన జరుగుతుంది. అయితే ఈ చిట్కాలను ఉపయోగించే ముందు చర్మానికి ఎటువంటి అలెర్జీలు లేవని నిర్ధారించుకోవడానికి కొద్ది మొత్తంలో టెస్ట్ చేసి చూడటం మంచిది. అలాగే ఏదైనా తీవ్రమైన చర్మ సమస్య ఉంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఛత్ పూజ ఉపవాసానికి ముందు... శక్తి, తేమ కోసం ఈ పానీయాలు తప్పనిసరి
Follow Us