🔴KOTA SRINIVAS RAO: మాజీ MLA కోట శ్రీనివాస్ రావు మృతిపై మోదీ దిగ్భ్రాంతి

ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు మృతి చెందారు. ఆయన మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

author-image
By Manoj Varma
New Update
Kota Srinivasa Rao Final Rites

Kota Srinivasa Rao Final Rites

LIVE BREAKINGS | Kota Srinivasa Rao | Kota Srinivasa Rao Condolence | kota srinivasa rao death | Kota Srinivasa Rao Death Live Updates

  • Jul 13, 2025 17:03 IST

    Allari Naresh Tweet



  • Jul 13, 2025 16:58 IST

    Modi Tweet



  • Jul 13, 2025 16:27 IST

    మాజీ MLA కోట శ్రీనివాస్ రావు మృతిపై మోదీ దిగ్భ్రాంతి

    బీజేపీ మాజీ ఎమ్మెల్యే, విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ రావు మ‌ృతిపై మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నటుడిగానే కాకుండా సామాజిక సేవలోనూ ఆయన తనదైన ముద్ర వేశారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కోట శ్రీనివాస రావు మరణం బాధాకరమని ప్రదాని విచారం వ్యక్తం చేశారు.

    kota bjp

     



  • Jul 13, 2025 16:26 IST

    కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు లైవ్.. కన్నీటి వీడ్కోలు

    సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ రావు మృతితో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన అంత్యక్రియలు ఈరోజు మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

     

    Kota Srinivasa Rao Final Rites
    Kota Srinivasa Rao Final Rites

     



  • Jul 13, 2025 13:52 IST

    Kota Srinivasa Rao: ఆ సూపర్ హిట్ పాట పాడింది 'కోట' నే.. ఈ విషయం మీకు తెలుసా?

    కోట శ్రీనివాస్ నటన మాత్రమే కాదు పలు సినిమాల్లో ఆయన స్వరం వినిపించి కూడా అలరించారు కోట. అవును.. కోట రెండు, మూడు  సూపర్ హిట్ సినిమాల్లో పాటలు కూడా పాడారు.

    Gabbar Singh Songs | Mandu Babulam Full Video Song | Latest Telugu Superhits @SriBalajiMovies

     



  • Jul 13, 2025 11:26 IST

    Kota Srinivasa Rao : 'ఇద్దరూ ఇద్దరే'.. అక్కినేనికి కోట అదిరిపోయే పంచ్!

    ఓ టైమ్ లో అక్కినేని నాగేశ్వరరావుతో సరదాగా మాట్లాడిన సంబాషణను ఆయన ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. అక్కినేని, నాగార్జున కలిసి నటించిన సినిమా ఇద్దరూ ఇద్దరే. ఈ సినిమా గురించి బయట  ఏం అనుకుంటున్నారు అని అక్కినేని కోటను అడిగారట.

    akkineni nageshwarao



  • Jul 13, 2025 11:06 IST

    Kota Srinivas Rao: మీమ్స్ లోనూ 'కోట'.. ఎవర్ ట్రెండింగ్ మీమ్స్ ఇవే!

    కోట శ్రీనివాసరావు డైలాగులు, హావభావాలు మీమ్స్ రూపంలో ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. యువత ఆయన మీమ్స్‌ను సోషల్ మీడియాలో బాగా వాడుతుంటారు. 

     

    kota srinivas rao comedy memes
    kota srinivas rao comedy memes

     

     

     



  • Jul 13, 2025 11:05 IST

    Kota Srinivasa Rao : కెరీర్ చివర్లో సినిమా అవకాశాలు కోసం అడుక్కున్న కోట.. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు అగవు!

    వయోభారం కారణంగా ఆయన చివర్లో సినిమాలకు దూరమయ్యారు. కానీ ఏ నటుడికి అయిన తాను చనిపోయే వరకు సినిమాల్లో నటించాలని కోరిక ఉంటుంది. అలాగే కోట కూడా నటించాలని అనుకున్నారు. కానీ వయోభారం కారణంగా ఆయనకు ఆవకాశాలు ఎవరూ ఇవ్వలేదు. 

    kota cinema offers



  • Jul 13, 2025 11:05 IST

    Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు మృతి.. కన్నీళ్లు పెట్టుకున్న చంద్రబాబు, రేవంత్

    కోట శ్రీనివాసరావు మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న కోట శ్రీనివాసరావు మరణం విచారకరమని ఎమోషనల్ అయ్యారు.

     

    Kota Srinivasa Rao died chandrababu and revanth reddy emotional
    Kota Srinivasa Rao died chandrababu and revanth reddy emotional

     



  • Jul 13, 2025 11:04 IST

    Kota Srinivas Rao: కోట మృతిపై కన్నీళ్లు పెట్టిస్తున్న చిరు, బాలయ్య, ఎన్టీఆర్ ట్వీట్స్ !

    విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ మృతిపై   చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. బాలయ్య, చిరంజీవి, ఎన్టీఆర్, రవితేజ, ఎక్స్ వేదికగా ఎమోషనల్ ట్వీట్స్ చేశారు. 

     

    Chiranjeevi balayya emotional tweets on Kota Srinivasa Rao death
    Chiranjeevi balayya emotional tweets on Kota Srinivasa Rao death

     



  • Jul 13, 2025 11:04 IST

    Kota Srinivas Rao: ఈ వార్త అబద్ధమైతే బాగుండు.. కోట మృతిపై కన్నీరు పెట్టిస్తోన్న యంగ్ కమెడియన్ మాటలు!

    కోట శ్రీనివాసరావు మృతిపై కమెడియన్ రచ్చ రవి ఎమోషనల్ పోస్టు పెట్టారు. ‘‘పొద్దు పొద్దున్నే నా గుండె కోటను తడిపిన ఒక వార్త అబద్ధమైతే ఎంత బాగుండో. విభిన్న పాత్రలతో అందరి హృదయాలను గెలిచిన కోట శ్రీనివాసరావు విడిచి వెళ్లడం ఎంతో బాధేసింది.’’ అని రాసుకొచ్చారు

     

    Racha Ravi Emotional
    Racha Ravi Emotional

     



  • Jul 13, 2025 11:03 IST

    పుట్టినరోజు జరుపుకున్న 3 రోజులకే.. కోట మరణంపై కన్నీరు పెట్టిస్తున్న కుటుంబ సభ్యుల మాటలు!

    జూలై 10న పుట్టినరోజు జరుపుకున్న కోట శ్రీనివాసరావు, జూలై 13 తెల్లవారుజామున కన్నుమూశారు. "మూడు రోజుల క్రితం ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇంత త్వరగా మమ్మల్ని వదిలి వెళ్తారని ఊహించలేదు" అని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వారి ఆవేదన అందరినీ కలచివేస్తోంది.

     

    Kota Srinivasa Rao died (1)
    Kota Srinivasa Rao died (1)

     



  • Jul 13, 2025 11:02 IST

    Kota Srinivasa Rao: ఒక పాత్ర కోసం ఐదు రోజుల ఉపవాసం.. కోట గురించి ఆసక్తికరమైన విషయాలు!

    స్టేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తూనే, వందల సంఖ్యలో నాటకాల్లో నటించారు కోట. రంగస్థలంపై ఆయనకు విశేష అనుభవం ఉంది, ఇది ఆయన సినీ నటనకు పునాది వేసింది. చిరంజీవి తొలి చిత్రమైన ప్రాణం ఖరీదుతోనే కోట కూడా సినీ రంగ ప్రవేశం చేశారు.

    kota



  • Jul 13, 2025 11:02 IST

    Kota Srinivasa Rao: ఆయన మీద కోపంతో ఎమ్మెల్యేగా.. కోట గురించి ఎవరికీ తెలియని విషయాలు!

     కోట శ్రీనివాసరావు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన  1999 నుండి 2004 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. కోట శ్రీనివాసరావుకి ముందు నుంచీ రాజకీయాల పట్ల ఆసక్తి ఉండేది

    kota bjp



  • Jul 13, 2025 11:01 IST

    Kota Srinivasa Rao: కోటపై ఎన్టీఆర్ అభిమానులు దాడి.. విజయవాడ రైల్వేస్టేషన్‌లో!

    కోట శ్రీనివాసరావు  కెరీర్‌లో ఒక వివాదాస్పద చిత్రం మండలాధీశుడు. ఈ చిత్రంలో ఆయన నటించిన ఒక పాత్ర అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావుగారిని వ్యంగ్యంగా అనుకరించేలా ఉంటుందని భావించారు. ఈ సినిమా విడుదలైన తర్వాత ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

    nt ramarao



  • Jul 13, 2025 11:00 IST

    Kota Srinivasa Rao - Babu Mohan: ఎవర్‌గ్రీన్ కాంబినేషన్.. కోట, బాబు మోహన్‌ల విడదీయలేని బంధం

    కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ తెలుగు సినిమా కామెడీకి ప్రతీకలు. వీరిద్దరూ కలిసి దాదాపు 60కి పైగా చిత్రాలలో నటించారు. మామగారు, ప్రేమ విజేత, సీతారత్నం గారి అబ్బాయి వంటి ఎన్నో సినిమాల్లో వారి కాంబినేషన్ నవ్వులు పూయించింది.

     

    Kota Srinivasa Rao - Babu Mohan movies
    Kota Srinivasa Rao and Babu Mohan tollywood comedy movies

     



  • Jul 13, 2025 10:59 IST

    Kota Srinivasa Rao : రావు గోపాల్ రావుని కాదని వేషం వేయించి..కోట జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా!

    జంద్యాల దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా తెరకెక్కిన చిత్రం అహ! నా పెళ్ళంట. సురేష్ ప్రొడక్షన్స్ రూపొందించిన ఈ చిత్రం 1987లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది.  ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు లక్ష్మీపతి అనే పిసినారి పాత్రలో నటించి మొప్పించారు.

    kota rao gopal rao



  • Jul 13, 2025 10:34 IST

    Kota Srinivasa Rao Awards: అవార్డుల 'కోట', అభినయ సామ్రాట్!

    పద్మశ్రీ కోట శ్రీనివాసరావు తెలుగు సినిమాకు చేసిన సేవలకుగాను 2015లో భారత ప్రభుత్వం నుండి "పద్మశ్రీ" అందుకున్నారు. ఆయన తొమ్మిది నంది అవార్డులు (ఉత్తమ విలన్, సహాయ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ విభాగాల్లో) గెలుచుకున్నారు. మరెన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు.

     

    Kota Srinivasa Rao Awards
    Kota Srinivasa Rao Awards

     



  • Jul 13, 2025 10:33 IST

    కొడుకును పొగొట్టుకుని సినిమాల్లో నవ్వించి.. కోట జీవితంలో విషాద ఛాయలు!

    నటుడు కోట జీవితంలో కూడా చాలా విషాదఛాయలున్నాయి.  కోట శ్రీనివాసరావుగారికి ఒక కుమారుడు ఉన్నారు. ఆయన పేరు కోట వెంకట అంజనేయ ప్రసాద్. దురదృష్టవశాత్తు  ప్రసాద్. 2010 జూన్ 20న హైదరాబాద్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు.

    kota srinivas rao 1



  • Jul 13, 2025 10:32 IST

    బ్యాంకు జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. కోట శ్రీనివాస్ సినీ ప్రస్థానం ఇదే

    తెలుగు సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్న విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఇవాళ తుది శ్వాస విడిచారు. 4 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో కొనసాగిన ఆయన ప్రస్థానం అద్భుతం. కోట శ్రీనివాసరావు అభినయానికి పెట్టని కోట.. నవరస నటనా సార్వభౌముడు.

     

    Kota Srinivasa Rao Died
    Kota Srinivasa Rao Died

     



  • Jul 13, 2025 10:31 IST

    నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత

    ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు.  గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా ఆయన ఆదివారం తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు మృతి చెందారు. ఆయన మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.  

    kota srinivasarao



Advertisment
Advertisment
తాజా కథనాలు