Kota Srinivasa Rao : రావు గోపాల్ రావుని కాదని వేషం వేయించి..కోట జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా!

జంద్యాల దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా తెరకెక్కిన చిత్రం అహ! నా పెళ్ళంట. సురేష్ ప్రొడక్షన్స్ రూపొందించిన ఈ చిత్రం 1987లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది.  ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు లక్ష్మీపతి అనే పిసినారి పాత్రలో నటించి మొప్పించారు.

New Update
kota rao gopal rao

జంద్యాల దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా తెరకెక్కిన చిత్రం అహ! నా పెళ్ళంట. సురేష్ ప్రొడక్షన్స్ రూపొందించిన ఈ చిత్రం 1987లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది.  ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు లక్ష్మీపతి అనే పిసినారి పాత్రలో నటించి మొప్పించారు. అరగుండు పాత్ర బ్రహ్మానందంతో కలిసి కోట పండించిన కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ సినిమాకు ముందు, ఆ తరువాత అనే పేరు కోటకు ఉంది. ముందుగా ఈ పాత్రను రావు గోపాల్ రావుతో చేయించాలని నిర్మాత రామానాయుడు జంధ్యాలకు సూచించారట. లేద లేదు దీనికి కోట శ్రీనివాసరావు బాగా సరిపోతారని జంద్యాల పట్టుబట్టరాట.  దీనిపై ఇద్దరి మధ్య దాదాపుగా 20 రోజులుగా చర్చలు జరిపి ఫైనల్ గా కోటనే తీసుకున్నారు.  అప్పటికి కేవలం రెండే సినిమాల్లో కోట శ్రీనివాసరావు నటించారు.

విగ్గు పెట్టుకుని నటిస్తానని చెప్పి

 లక్ష్మీపతి పాత్రకు అనుగుణంగా కోట శ్రీనివాసరావు జుట్టు చాలావరకూ తీసేయించుకుని చిన్న తలకట్టుతో క్రాఫ్ చేయించుకోవాలి. అప్పటికే మరికొన్ని సినమాల్లో నటిస్తూండడంతో, ఈ సినిమాలోని పాత్ర ప్రాధాన్యత, విశిష్టత దృష్ట్యా దీన్ని వదులుకోలేక విగ్గు పెట్టుకుని నటిస్తానని ఇతర చిత్రాల దర్శక నిర్మాతలను ఒప్పించి మరీ దీనిలో పాత్ర పోషించారు. ముతకపంచె, బనీను, పగిలిన కళ్ళద్దాలతో కనిపించే ఈ పాత్ర ఆహార్యాన్ని జంధ్యాలే స్వయంగా తీర్చిదిద్దారు. పంచె, బట్టలు మాసిపోయి వుండాలని, పనిగట్టుకుని దుమ్ములో దొర్లించి మరీ ఇచ్చేవారట, కళ్ళజోడు మామూలుదే తెప్పించి తర్వాత జంధ్యాల రాయిపెట్టి పగలగొట్టి పగిలిన కళ్ళద్దాలతో నటింపజేశారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంలో కోట తనదైన ముద్ర వేశారు. 

కోట శ్రీనివాసరావు 2023లో విడుదలైన 'సువర్ణ సుందరి' చిత్రంలో చివరిసారిగా కనిపించారు.  అంతకు ముందు, 2021లో వచ్చిన కొండపొలం, పవర్ ప్లే వంటి చిత్రాల్లో కూడా కనిపించారు. వయసు మీద పడటంతో, ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ  క్రమంలో ఆదివారం తెల్లవారుజూమున తుదిశ్వాస విడిచారు.  

Advertisment
Advertisment
తాజా కథనాలు