/rtv/media/media_files/2025/07/13/akkineni-nageshwarao-2025-07-13-11-19-17.jpg)
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన ఆదివారం ఉదయం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సీనీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం తెలుపుతున్నారు. 750 పైగా సినిమాల్లో నటించిన కోట శ్రీనివాసరావు విలనిజం, హాస్యం, కరుణ, రౌద్రం - ఇలా అన్ని రకాల రసాలను పండించి పరిపూర్ణమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో అన్ని రకాల పాత్రలు పోషించిన కోట బయట ఓపెన్ గా ఉండేవారు.
Also Read : బ్యాంకు జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. కోట శ్రీనివాస్ సినీ ప్రస్థానం ఇదే
Also Read : అమెరికా వెళ్లే భారతీయులకు బిగ్ షాక్.. US ఎంబసీ వార్నింగ్
నిద్దరే నిద్దర
ఓ టైమ్ లో అక్కినేని నాగేశ్వరరావుతో సరదాగా మాట్లాడిన సంబాషణను ఆయన ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. అక్కినేని, నాగార్జున కలిసి నటించిన సినిమా ఇద్దరూ ఇద్దరే. ఈ సినిమా గురించి బయట ఏం అనుకుంటున్నారు అని అక్కినేని కోటను అడిగారట. దీనికి నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా అని కోట అక్కినేనిని ప్రశ్నించారట. ఉన్నది చెప్తావ్ కాబట్టే నిన్ను అడిగా కదయ్యా అని అక్కినేని బదులు ఇచ్చారట. దీంతో ఇద్దరూ ఇద్దరే అని మీరు అంటే.. బయట నిద్దరే నిద్దర అని అంటున్నారని కోట సమాధానం ఇచ్చారట. కోట పంచ్ కు అక్కినేని పగలపడి నవ్వారట.
Also Read : ఇంగ్లాండ్‌లో ఊచకోత.. వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టిన KL రాహుల్
Also Read : భార్యతో విడాకులు.. ఆనందంతో 40 లీటర్ల పాలతో స్నానం..
tollywood | akkineni-nageshwar-rao | akkineni-nagarjuna | kota srinivas rao latest news | Actor Kota Srinivasa Rao | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news