New Update
/rtv/media/media_files/2025/07/13/racha-ravi-emotional-2025-07-13-09-01-11.jpg)
Racha Ravi Emotional
తెలుగు సినీ లోకంలో తీవ్ర విషాదం. దశాబ్దాల పాటు తన అభినయంతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న పద్మశ్రీ కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. ఈ వార్త సినీ పరిశ్రమను, ముఖ్యంగా ఆయనతో కలిసి పనిచేసిన నటులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రముఖ కమెడియన్ రచ్చ రవి, కోట శ్రీనివాసరావు మరణ వార్తపై తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన వ్యక్తం చేసిన ఆవేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
రచ్చ రవి భావోద్వేగ పోస్టు:
‘‘పొద్దు పొద్దున్నే నా గుండె కోటను తడిపిన.. ఒక వార్త అబద్ధమైతే ఎంత బాగుండో. తెరమీద విభిన్న పాత్రలతో మన అందరి హృదయాలను గెలిచిన నటనకే కోటకట్టుకున్న.. పెద్దలు కోట శ్రీనివాసరావు గారు ఇక సెలవు అని మన అందరిని విడిచి వెళ్లడం ఎంతో బాధేసింది. కోటన్న మీ ఆత్మ కు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ.. ఓం శాంతి’’ అంటూ సోషయల్ మీడియా ప్లాట్ ఫార్మ్ ఫేస్ బుక్ ద్వారా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
/rtv/media/post_attachments/d58c450e-c65.png)
తాజా కథనాలు