Kota Srinivasa Rao: ప్రముఖ నటుడు కోట శ్రీనివాస్ రావు మృతి టాలీవుడ్ కి తీరని విషాదాన్ని మిగిల్చింది. 700 వందలకు పైగా సినిమాల్లో విలక్షణ నటుడిగా ఆయన వేసిన పాత్రలు మరుపురానివి! కామెడీ పండించినా, సీరియస్ పాత్రలు చేసినా.. ప్రతీ పాత్రలోనూ ఆయన హావభావాలు, డైలాగులు ప్రత్యేకం. ఆ తరం, ఈ తరం అందరికీ అభిమాన నటుడిగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు.
కోట పాడిన పాట
నటన మాత్రమే కాదు పలు సినిమాల్లో ఆయన స్వరం వినిపించి కూడా అలరించారు కోట. అవును.. కోట రెండు, మూడు సూపర్ హిట్ సినిమాల్లో పాటలు కూడా పాడారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' మూవీలో 'మందు బాబులం.. మేము మందుబాబులం' సాంగ్ పాడారు. 'గబ్బర్ సింగ్' విడుదలైన సమయంలో ఈ పాట సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయ్యింది. ఈ పాటలోని కొన్ని డైలాగ్స్, సన్నివేశాలు మీమ్స్‌గా మారి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా కోట శ్రీనివాసరావు ఎక్స్‌ప్రెషన్స్, లిరిక్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇది మాత్రమే కాదు 'సిసింద్రీ' సినిమాలో కూడా ఒక సాంగ్ పాడారు కోట. ''ఓరి నాయానో'' సాంగ్ పాడారు..కానీ కొన్ని కారణాల చేత ఇది థియేటర్స్ లో విడుదల కాలేదు.
#PawanKalyanBirthdayCDP@PawanKalyan#VakeelSaab
— Kiran Kotharu (@ravikiran660) August 15, 2020
Mandu Babulam Song - Gabbar Singh pic.twitter.com/SFcZRnlDUO
Also Read : పుట్టినరోజు జరుపుకున్న 3 రోజులకే.. కోట మరణంపై కన్నీరు పెట్టిస్తున్న కుటుంబ సభ్యుల మాటలు!