/rtv/media/media_files/2025/07/13/kota-srinivas-rao-1-2025-07-13-06-41-20.jpg)
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా ఆయన ఆదివారం తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు మృతి చెందారు. ఆయన మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు
— Hemu 🚩 (@hemanth2peddir1) July 13, 2025
కన్నుమూత,
తెల్ల వారు జామున తుది విడిచారు,
గొప్ప నటుడు 🙏
ఓం శాంతి!!!#kotasrinivasraopic.twitter.com/TSXXk0KGUQ
1978లో చిరంజీవి తొలి చిత్రమైన 'ప్రాణం ఖరీదు'తో కోట శ్రీనివాసరావుగారు వెండితెర అరంగేట్రం చేశారు. రావు గోపాలరావు తర్వాత తెలుగు విలనిజానికి సరికొత్త రూపం చూపించిన నటుడు కోట శ్రీనివాసరావు. విలన్‌గా, హాస్యనటుడిగానే కాకుండా, సహాయ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా వందల సినిమాల్లో నటించి మెప్పించారు.
జీవితంలో విషాదఛాయలు
750కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన కోట జీవితంలో కూడా చాలా విషాదఛాయలున్నాయి. కోట శ్రీనివాసరావుగారికి ఒక కుమారుడు ఉన్నారు. ఆయన పేరు కోట వెంకట అంజనేయ ప్రసాద్. దురదృష్టవశాత్తు ప్రసాద్. 2010 జూన్ 20న హైదరాబాద్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ఘటన కోట జీవితంలో కోలుకోని పెద్ద దెబ్బ. కోట శ్రీనివాసరావుగారు తన ఏకైక కుమారుడిని కోల్పోయిన విషాదం ఆయన జీవితంలో ఒక తీరని లోటుగా మిగిలిపోయింది. ఈ సంఘటన గురించి ఆయన పలు సందర్భాల్లో ఎమోషనల్‌గా మాట్లాడారు. 1971లో జన్మించిన కోట వెంకట అంజనేయ ప్రసాద్ మరణించే సమయానికి 39 సంవత్సరాలు.
ప్రసాద్ కూడా తన తండ్రి అడుగుజాడల్లో సినీ రంగంలోకి ప్రవేశించారు జె.డి. చక్రవర్తి దర్శకత్వం వహించిన 'సిద్ధం' సినిమాలో నటించారు. అలాగే, 'గాయం 2' సినిమాలో తన తండ్రితో కలిసి నటించారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో నార్సింగి కప్ప వద్ద తన స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా, ఒక డీసీఎం వ్యాన్‌ను ఢీకొని తీవ్ర గాయాలతో మరణించారు. ఈ ఘటన తెలుగు సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. కోటకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు.