/rtv/media/media_files/2025/07/13/kota-srinivasa-rao-died-chandrababu-and-revanth-reddy-emotional-2025-07-13-10-27-50.jpg)
Kota Srinivasa Rao died chandrababu and revanth reddy emotional
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటును మిగులుస్తూ, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు (83) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మరణ వార్తతో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం అలుముకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఏపీ మాజీ సీఎం జగన్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
Also Read : MLC తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి
ఏపీ సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణం విచారకరం. సుమారు నాలుగు దశాబ్దాల పాటు సినీ, నాటక రంగాలకు ఆయన చేసిన కళా సేవ, ఆయన పోషించిన పాత్రలు చిరస్మరణీయం. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన పోషించిన ఎన్నో మధురమైన పాత్రలు తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరనిలోటు. 1999లో విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ప్రజాసేవ చేశారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.’’ అని చంద్రబాబు తన పోస్టులో రాసుకొచ్చారు.
వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు గారి మరణం విచారకరం. సుమారు నాలుగు దశాబ్దాల పాటు సినీ, నాటక రంగాలకు ఆయన చేసిన కళా సేవ, ఆయన పోషించిన పాత్రలు చిరస్మరణీయం. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన పోషించిన ఎన్నో మధురమైన… pic.twitter.com/4C6UL29KPR
— N Chandrababu Naidu (@ncbn) July 13, 2025
Also Read : 'మోనికా' పాటలో పూజతో స్టెప్పులేసిన ఈ నటుడు ఎవరు? సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
‘‘ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. చలన చిత్ర పరిశ్రమకు ఆయన లేని లోటు తీర్చలేనిది. భౌతికంగా కోట మన మధ్య లేకపోయినా.. ఆయన పోషించిన విభిన్న పాత్రలతో.. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.’’ అని రాసుకొచ్చారు.
ప్రముఖ నటుడు….
— Revanth Reddy (@revanth_anumula) July 13, 2025
కోట శ్రీనివాసరావు గారి
మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
చలన చిత్ర పరిశ్రమకు
ఆయన లేని లోటు తీర్చలేనిది.
భౌతికంగా కోట గారు మన మధ్య లేకపోయినా…
ఆయన పోషించిన విభిన్న పాత్రలతో…
తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని… pic.twitter.com/ANsHre9lNx
Also Read : నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి
మాజీ సీఎం జగన్
‘‘ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు మృతి విచారకరం. విలక్షణమైన పాత్రల్లో నటించి, మెప్పించిన ఆయనను పద్మశ్రీతో పాటు ఎన్నో అవార్డులు వరించాయి. కోటా మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నివాళులు.’’ అంటూ తెలిపారు.
ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు గారి మృతి విచారకరం. విలక్షణమైన పాత్రల్లో నటించి, మెప్పించిన ఆయనను పద్మశ్రీతో పాటు ఎన్నో అవార్డులు వరించాయి. కోటా గారి మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నివాళులు. pic.twitter.com/FjQsioIsO3
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 13, 2025
Also Read : కారు బీభత్సం.. ఫుట్‌పాత్‌పై పడుకున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు స్పాట్‌లో!
Kota Srinivasa Rao | Actor Kota Srinivasa Rao