Kota Srinivas Rao: కోట మృతిపై కన్నీళ్లు పెట్టిస్తున్న చిరు, బాలయ్య, ఎన్టీఆర్ ట్వీట్స్ !

విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ మృతిపై   చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. బాలయ్య, చిరంజీవి, ఎన్టీఆర్, రవితేజ, ఎక్స్ వేదికగా ఎమోషనల్ ట్వీట్స్ చేశారు. 

New Update
Chiranjeevi balayya emotional tweets on Kota Srinivasa Rao death

Chiranjeevi balayya emotional tweets on Kota Srinivasa Rao death

ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని విషాదాన్ని మిగిల్చింది .  గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసంలో కన్నుమూశారు. కోట మృతి పట్ల  అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. సినీ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, రవితేజ, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ సంతాపం తెలియజేస్తూ ఎక్స్ వేదికగా భావోద్వేగ ట్వీట్స్ చేశారు.  

చిరంజీవి భావోద్వేగ పోస్ట్ 

''లెజండరీ యాక్టర్, బహుముఖ ప్రజ్ఞాశాలి కోట శ్రీనివాస్ రావు ఇకలేరనే వార్త ఎంతో కలచివేసింది. 'ప్రాణం ఖరీదు' సినిమాతో ఆయన నేను ఒకేసారి కెరీర్ ని ప్రారంభించాం! ఆ తర్వాత కోట వందల కొద్ది సినిమాల్లో ఎన్నో విభినమ్మైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. కామిడీ అయినా, సీరియస్ అయినా ఆయన పోషించిన ప్రతి పాత్ర ఆయన మాత్రమే చేయగలడు అనే అంత గొప్పగా నటించారు. కోట శ్రీనివాస్ రావు లాంటి నటుడు లేని లోటు సినీ ప్రేమికులకి   ఎన్నటికీ తీరదు'' అంటూ భావోద్వేగానికి గురయ్యారు చిరంజీవి. 

రవితేజ

అతన్ని చూస్తూ, ఆరాధిస్తూ, ప్రతి పాత్ర నుంచి నుండి నేర్చుకుంటూ పెరిగాను. కోట బాబాయ్ నాకు కుటుంబం లాంటివాడు, అతనితో కలిసి పనిచేసిన అందమైన జ్ఞాపకాలను నేను ఎప్పటికీ  గుర్తుంచుకుంటాను అంటూ ఎమోషనల్ అయ్యారు హీరో రవితేజ. 

మోహన్ బాబు 

ప్రియమైన కోట.. మిమ్మల్ని చాలా మిస్ అవుతాము.  మీ ప్రతిభ, మీ ఉనికి, మీ ఆత్మ  మరపురానివి. మీరు లేని లోటు తీరనిది అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు. 

ఎన్టీఆర్

''కోట శ్రీనివాసరావు… ఆ పేరే చాలు. ఎనలేని నటనా చాతుర్యం.ప్రతి పాత్రలో తనదైన శైలిలో ప్రాణం పోసిన మహానటుడు. నా సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన, పంచుకున్న క్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. 

నేను మిమ్మల్ని ఒక దిగ్గజ నటుడిగా కంటే తాతగా ఎక్కువ కలిశాను. మీ ఆప్యాయత, ప్రేమ ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు.

Also Read: Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు లైవ్.. కన్నీటి వీడ్కోలు

Advertisment
Advertisment
తాజా కథనాలు