Kota Srinivas Rao: మీమ్స్ లోనూ 'కోట'.. ఎవర్ ట్రెండింగ్ మీమ్స్ ఇవే!

విలక్షణ నటుడు కోట మృతి అభిమానులకు, సినీ పరిశ్రమకు తీరని విషాదాన్ని మిగిల్చింది. కోట పాతతరం నటుడైనప్పటికీ ఎన్నో అద్భుతమైన పాత్రల్లో ఆయన పలికించిన డైలాగులు, ఆయన చూపిన ఎక్స్‌ప్రెషన్స్ ఇప్పటికీ మీమ్స్ రూపంలో ట్రెండ్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

New Update
kota srinivas rao comedy memes

kota srinivas rao comedy memes

Kota Srinivas Rao: నటులు ఎంతో మంది ఉంటారు, కానీ కొందరు మాత్రమే తమ నటనతో ప్రజల మనసుల్లో నిలిచిపోతారు. అలాంటి వారిలో ఒకరు కోట శ్రీనివాసరావు.  ఆయన డైలాగులు, హావభావాలు ఎప్పటికీ  మీమ్స్ రూపంలో ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. యువత ఆయన మీమ్స్‌ను సోషల్ మీడియాలో బాగా వాడుతుంటారు. 

Also Read :  MLC తీన్మార్‌ మల్లన్న ఆఫీసుపై దాడి

మీమ్స్‌తో ఆకట్టుకుంటున్న కోట

ఎన్నో అద్భుతమైన పాత్రల్లో కోట  పలికించిన కొన్ని డైలాగులు, ఆయన చూపిన ఎక్స్‌ప్రెషన్స్ ఇప్పుడు మీమ్స్  రూపంలో ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని డైలాగులు జనాలకు బాగా దగ్గరయ్యాయి. "యో సూస్కోబడ్డా!"  ఈ డైలాగ్ మీమ్‌గా చాలా ఫేమస్ అయ్యింది. అలాగే  "మనకి కావాల్సింది కూడా అదే లేమ్మా!",  "అదీ పాయింటే!", "జోకులు బాగా వేస్తావే!",  "వద్దు... నాకు ఈ బతుకొద్దు!" ఇలా అయన చెప్పిన అనేక డైలాగులు మీమ్స్ రూపంలో అలరిస్తున్నాయి. ఈ డైలాగ్స్ కేవలం నవ్వులు పూయించడమే కాదు, ప్రేక్షకులకు ఆయనను గుర్తుండిపోయేలా చేశాయి. 

Also Read :  'మోనికా' పాటలో పూజతో స్టెప్పులేసిన ఈ నటుడు ఎవరు? సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్

Also Read :  పుట్టినరోజు జరుపుకున్న 3 రోజులకే.. కోట మరణంపై కన్నీరు పెట్టిస్తున్న కుటుంబ సభ్యుల మాటలు!

కోట  కామెడీ పండించినా, సీరియస్ పాత్రలు చేసినా, లేదా సందేహపడినట్లు నటించినా... ప్రతి సందర్భంలోనూ ఆయన హావభావాలు, డైలాగులు ప్రత్యేకంగా నిలుస్తాయి. అందుకే ఆయనను విలక్షణ నటుడు అంటారు. 

Also Read: Kota Srinivas Rao: కోట మృతిపై కన్నీళ్లు పెట్టిస్తున్న చిరు, బాలయ్య, ఎన్టీఆర్ ట్వీట్స్ !

Advertisment
Advertisment
తాజా కథనాలు