Kota Srinivasa Rao: ఆయన మీద కోపంతో ఎమ్మెల్యేగా.. కోట గురించి ఎవరికీ తెలియని విషయాలు!

 కోట శ్రీనివాసరావు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన  1999 నుండి 2004 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. కోట శ్రీనివాసరావుకి ముందు నుంచీ రాజకీయాల పట్ల ఆసక్తి ఉండేది

New Update
kota bjp

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు.  గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు మృతి చెందారు. ఆయన మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.  750కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. కోట శ్రీనివాసరావు కేవలం సినీ రంగంలోనే కాకుండా, రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పనిచేశారు.

 కోట శ్రీనివాసరావు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన  1999 నుండి 2004 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. కోట శ్రీనివాసరావుకి ముందు నుంచీ రాజకీయాల పట్ల ఆసక్తి ఉండేది. సినీ రంగంలో ఆయనకున్న ప్రజాదరణ, విజయవాడ ప్రాంతంలో ఆయన కుటుంబానికి ఉన్న గుర్తింపు, అలాగే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఆయన గెలుపునకు దోహదపడ్డాయి. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీతో బీజేపీకి పొత్తు ఉండటం కూడా ఆయన విజయానికి ఒక కారణం. 

ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో

ఎమ్మెల్యేగా ఆయన తన నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని చెబుతారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించిన కొద్ది మంది నటుల్లో ఆయన ఒకరు. 2004 ఎన్నికల్లో ఆయన మళ్ళీ పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. ఆ తర్వాత ఆయన ఎక్కువగా సినీ రంగంపైనే దృష్టి సారించారు. అయితే కోట పొలిటికల్ జర్నీపై ఆయన సహచర నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ గతంలో ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. అప్పటికే తాను ఎమ్మెల్యే అయి గన్‌మెన్లతో షూటింగ్‌కు వెళితే అది తట్టుకోలేని కోటా తాను కూడా ఎమ్మెల్యే కావాలని ఫిక్స్ అయినట్లు చెప్పుకొచ్చారు. 

కేవలం గన్‌మెన్ల కోసమే కోటా ఎమ్మెల్యేగా గెలిచారని బాబు మోహన్ తెలిపారు. ఆ తర్వాత ఎదురు పడినప్పుడు నీకే గన్‌మెన్లు కాదు నాక్కూడా ఉన్నారు.. ఇదిగో చూడు అనే వాడని తెలిపారు. ఇక అసెంబ్లీలో మరో తమాషా ఉండేది. తన సీటు ముందు వరుసలో ఉండేది. లాస్ట్ బెంచ్‌లో కోటన్నకు ఉండేది.  'అరేయ్.. నవ్వు అక్కడెందుకు కూర్చుంటవ్ రా.. మనం అన్నదమ్ములం కదా.. నా పక్కన కూర్చో' అనేవాడు. 'అయ్యో అన్న.. మనకు సీట్లు అలాట్‌మెంట్ ఉంటదని చెప్పిన వినేవాడు కాదన్నారు. అలా రెండేళ్లు గడిచాయని తెలిపారు.  తాను మంత్రి అయ్యాక..  తన సీటు మారడంతో  కోటన్న మరింత తట్టుకోలేకపోయాడన్నారు బాబు మోహన్.  నేను ఇప్పుడు కేబినెట్ మంత్రి.. నువ్వు జస్ట్ ఎమ్మెల్యే.. నువ్వు అక్కడ.. నేను ఇక్కడ అని సరదగా ఏడిపించేవాడినని తెలిపారు.  ఆ తర్వాత తాను ఎలాగూ మంత్రి కాలేనని తెలిసి కోటన్న అసెంబ్లీకి రావటం మానేశారని బాబు మోహన్ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.  

Advertisment
తాజా కథనాలు