Nobel Prize 2025: ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం
2025 సంవత్సరానికి గాను ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి లభించింది. జోయెల్ మోకిర్, ఫిలిప్ అగియోన్, పీటర్ హౌవిట్లకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నోబెల్ ప్రకటించింది.
2025 సంవత్సరానికి గాను ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి లభించింది. జోయెల్ మోకిర్, ఫిలిప్ అగియోన్, పీటర్ హౌవిట్లకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నోబెల్ ప్రకటించింది.
దక్షిణ త్రిపుర జిల్లాలోని సబ్రూమ్ సరిహద్దు పట్టణం నుండి మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న పాకిస్తాన్ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈమె నేపాల్ జైలు నుంచి పారిపోయినట్లు సమాచారం. బంగ్లాదేశ్ సరిహద్దు దాటి వెళ్లాలనే ఉద్దేశంతో వచ్చినట్లు తెలుస్తోంది.
దాదాపుగా రెండేళ్ల నుంచి హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారికి నేడు విముక్తి కలిగింది. మొదటి దశలో భాగంగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఏడుగురిని రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. రెండేళ్ల పాటు బందీలుగా ఉంటూ ఇప్పుడు విడుదల కావడంతో కుటుంబ సభ్యులు సంతోష పడుతున్నారు.
అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా మరోసారి సౌత్ కరోలినా రాష్ట్రంలో ఆదివారం తెల్లవారు జామున కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది చలికాలం మరింత ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈసారి 20 డిగ్రీల కన్నా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. శీతల పరిస్థితులకు దారితీసే లానినా తిరిగి రావడం వల్ల ఈ సీజన్ చలి మరింత తీవ్రతరమవుతుందని పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్లలో హిందువులపై దాడి జరిందన్న ఆరోపణలను కొట్టి పారేశారు.
అమెరికాలోని టెక్సాస్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పైలట్, కో పైలటర్ సహా ఇద్దరు మృతి చెందారు. గాల్లో ఎగురుతున్న చిన్న విమానం అదుపుతప్పి రోడ్డుపై కుప్పకూలింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్‌కు వెళ్లారు. ఆయన బయలుదేరేముందు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో యుద్ధం ముగిసిందని అధికారికంగా ప్రకటన చేశారు. ఇప్పటినుంచి పశ్చిమాసియాలో సాధారణమైన పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు.
కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో..పదవి నుంచి తప్పుకున్నాక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఫేమస్ పాప్ గాయనితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. తాజాగా లాస్ ఏంజెలెస్ లో శాంటి బార్బరా తీరంలో కేటీ పెర్రీ, ట్రూడోలు కిస్ చేసుకుంటున్న ఫొటోలు బయటకు వచ్చాయి.