/rtv/media/media_files/2025/10/13/trump-2025-10-13-06-43-03.jpg)
Trump
ఇటీవల ఇజ్రాయెల్-హమాస్ మధ్య మొదటి దశ శాంతి ఒప్పందం జరిగింది. అయితే కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ బందీలను హమాజ్ రిలీజ్ చేయనుంది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్‌కు బయలుదేరారు. ఆయన వెళ్లే ముందు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో యుద్ధం ముగిసిందని అధికారికంగా ప్రకటన చేశారు. ఇప్పటినుంచి పశ్చిమాసియాలో సాధారణమైన పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు.
Also read: కేటీ పెర్రీతో కెనడా మాజీ ప్రధాని..లాస్ ఏంజెలెస్ తీరంలో డేటింగ్..
కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ మొత్తానికి మరికొన్ని గంటల్లో ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయనుంది. రెండేళ్ల తర్వాత బందీలు విడుదల కానున్నారు. ట్రంప్ ముందుగా ఇజ్రాయెల్ చేరుకొని పార్లమెంటులో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత బందీల కుటుంబ సభ్యులతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ట్రంప్ ఈజిప్ట్‌కు వెళ్లనున్నారు. షర్మ్ ఎల్‌షేక్‌లో ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సినీ నిర్వహించనున్న శాంతి శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు.
అక్కడ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి సంతకాల కార్యక్రమం జరగనుంది. 20 దేశాధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నరు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగియడంతో.. ఇజ్రాయెల్‌తో పాటు పాలస్తీనా ప్రజలు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం ఇలాగే కొనసాగుతుందా లేదా మళ్లీ మొదలవుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇదిలాఉండగా 2023 అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే.
Also Read: భారత పరిశ్రమలు బంగ్లాదేశ్‌కు వస్తాయి.. యూనస్ సంచలన వ్యాఖ్యలు
ఈ దాడుల్లో 1200 మంది చనిపోయారు. 251 మంది ఇజ్రాయెల్ వాసులను బందీలుగా తీసుకెళ్లారు. ఆ తర్వాత కొందరిని రిలీజ్ చేశారు. ప్రస్తుతం హమాస్ వద్ద 48 మంది బందీలు ఉండగా వాళ్లని తిరిగి అప్పగించనున్నారు. వీళ్లలో 20 మంది సజీవంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా దీనికి ప్రతీగా 2 వేల మందికి పైగా పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనుంది. సోమవారం సాయంత్రం వీళ్లందరూ జైళ్ల నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.