Nobel Prize 2025: ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ పురస్కారం

2025 సంవత్సరానికి గాను ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి లభించింది. జోయెల్ మోకిర్, ఫిలిప్ అగియోన్, పీటర్ హౌవిట్లకు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ నోబెల్ ప్రకటించింది.

New Update
nobel

2025 సంవత్సరానికి గాను ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి(Nobel Prize in Economics 2025 లభించింది. జోయెల్ మోకిర్, ఫిలిప్ అగియోన్, పీటర్ హౌవిట్లకు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ నోబెల్ ప్రకటించింది. వీరి ముగ్గురి పరిశోధన, ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వృద్ధిని వివరించినందుకుఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.

చారిత్రక ఆర్థికవేత్త అయిన జోయెల్ మోకిర్కు సగం బహుమతి లభించింది. సాంకేతిక పురోగతి ద్వారా సుదీర్ఘకాలం పాటు కొనసాగే వృద్ధికి అవసరమైన ముందస్తు పరిస్థితులను ఆయన గుర్తించారు. సమాజం కొత్త ఆలోచనలను అంగీకరించి, మార్పును అనుమతించినప్పుడే వృద్ధి సాధ్యమవుతుందని ఆయన వివరించారు.  ఫిలిప్ అగియోన్, పీటర్ హౌవిట్లకు మిగిలిన సగం బహుమతి సంయుక్తంగా లభించింది.

Also Read : Vemulawada : వేములవాడలో దర్శనాల వివాదం..పొంతనలేని ప్రకటనలతో అయోమయం

బహుమతి విలువ $1.2 మిలియన్లు

వీరు సృజనాత్మక విధ్వంసం (సిద్ధాంతం ద్వారా సుస్థిర వృద్ధిని వివరించే గణిత నమూనాను అభివృద్ధి చేశారని క‌మిటీ తెలిపింది. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి(Nobel Prize 2025) తో ఈ ఏడాదికి సంబంధించిన నోబెల్ పురస్కారాల ప్రకటన ముగిసింది. ఈ బహుమతి విలువ 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్‌లు ($1.2 మిలియన్లు). ఆరు రంగాల్లో విశిష్టమైన సేవలందించినందుకు గాను నోబెల్‌ ఫౌండేషన్‌ ప్రకటించే నోబెల్‌ బహుమతుల్లో ఆర్థిక శాస్త్రంలో పొందే నోబెల్‌ బహుమతికి అత్యంత అరుదైన గౌరవంగా భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు