Yunus: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు.. యూనస్ ఏమన్నారంటే ?

బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్లలో హిందువులపై దాడి జరిందన్న ఆరోపణలను కొట్టి పారేశారు.

New Update
Yunus denies attacks on Hindus in Bangladesh

Yunus denies attacks on Hindus in Bangladesh

బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు ఉన్న ప్రత్యేకతలలో ఫేక్ వార్తలు కూడా ఒకటంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. ''గతేడాది బంగ్లాదేశ్‌లో అధికార ప్రభుత్వం నుంచి ప్రజలు తిరుగాబుటు చేశారు. దీనివల్ల అప్పటి ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి వైదొలిగారు. ఆ సమయంలో జరిగిన అల్లర్లలో హిందువులపై దాడులు జరిగినట్లు పెద్దఎత్తున ప్రచారం నడిచిందని'' జర్నలిస్టు ప్రశ్నించారు. 

Also Read: మత్స్యకారులకు కాసుల వర్షం.. రూ.కోటికి అమ్ముడుపోయిన చేపలు

దీనిపై స్పందించిన మహమ్మద్ యూన్‌ అవన్నీ తప్పుడు వార్తలంటూ కొట్టిపారేశారు. కొన్ని ప్రాంతాల్లో భూ వివాదాలు జరిగితే దాన్ని మత ఘర్షణులుగా కొందరు ప్రచారాలు చేశారని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా భారత్‌పై ప్రస్తుతం అమెరికా 50 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌పై 35 శాతం టారిఫ్‌ విధిచంగా ఇరుదేశాల మధ్య సంప్రదింపుల జరిగిన అనంతరం 20 శాతం తగ్గింది. ఈ అంశంపై కూడా యూనస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 

Also Read:  నువ్వేం తండ్రివి రా.. భార్య విడిచి వెళ్లిందనే కోపంతో ముగ్గురు పిల్లలను గొంతు కోసి హత్య

అమెరికా టారిఫ్‌లు బంగ్లాదేశ్‌ కన్నా భారత్‌లో అధికంగా ఉన్నాయన్నారు. భారత్‌లో ఉన్న పరిశ్రమలు త్వరలోనే తమ దేశాన్ని వదిలేసి బంగ్లాదేశ్‌కు వస్తాయని చెప్పారు. బంగ్లాదేశ్‌లో టారిఫ్‌లు తక్కువగా ఉన్నాయని అందుకే ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. చాలామంది నెటిజన్లు దీన్ని కొట్టిపారేస్తున్నారు. శాంతి భద్రతలు లేని బంగ్లాదేశ్‌కు భారత్‌ పరిశ్రమలు రావడం పెద్ద జోక్‌ అంటూ సెటైర్లు వేస్తున్నారు. 

Also Read: గాల్లో తిరుగుతూ కుప్పకూలిన హెలికాప్టర్.. వీడియో వైరల్

Advertisment
తాజా కథనాలు