Israel-Hamas: రెండేళ్ల తర్వాత బందీలకు విడుదల.. హమాస్ చెర నుంచి విముక్తి!

దాదాపుగా రెండేళ్ల నుంచి హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారికి నేడు విముక్తి కలిగింది. మొదటి దశలో భాగంగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఏడుగురిని రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. రెండేళ్ల పాటు బందీలుగా ఉంటూ ఇప్పుడు విడుదల కావడంతో కుటుంబ సభ్యులు సంతోష పడుతున్నారు.

New Update
Israel

Israel

దాదాపుగా రెండేళ్ల నుంచి హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారికి నేడు విముక్తి కలిగింది. మొదటి దశలో భాగంగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఏడుగురిని రెడ్‌క్రాస్‌కు అప్పగించింది.  ఖాన్ యూనిస్ నుంచి తీసుకుని.. వారిని రెడ్‌క్రాస్ వాహనశ్రేణి ఇజ్రాయెల్‌కు బయలు దేరింది. రెండేళ్ల పాటు బందీలుగా ఉంటూ ఇప్పుడు విడుదల కావడంతో కుటుంబ సభ్యులు సంతోష పడుతున్నారు. అయితే మిగతా ఉన్న బందీలను కూడా హమాస్ విడిచి పెట్టనుంది. అలాగే ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అయితే ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపి శాంతి జరిగేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేశారు. 20 సూత్రాల శాంతి ప్రణాళిక తొలి దశలో భాగంగా రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.

ఇది కూడా చూడండి: Trump: గాజాలో యుద్ధం ముగిసింది : ట్రంప్ అధికారక ప్రకటన

రెండేళ్ల పాటు బందీలుగా ఉన్నవారికి..

ఒప్పందం ప్రకారం బందీలను విడుదల చేసింది.  వీరిని గాజాలోని మూడు ప్రాంతాల్లో విడుదల చేస్తారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ 2 వేల మందికి పైగా పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడానికి అంగీకరించింది. రెండేళ్ల తర్వాత వీరికి విముక్తి కలిగింది. ఇదిలా ఉండగా 2023 అక్టోర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1200 మంది హత్య చేసింది. అలాగే 251 మందిని బందీలుగా తీసుకుంది. ఈ దాడిలో ఎంతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుస దాడులు ఇరు దేశాల మధ్య జరుగుతున్నాయి. ఇప్పుడు దానికి డొనాల్డ్ ట్రంప్ శాంతి ఒప్పందం కుదిర్చారు.

ఇది కూడా చూడండి: BREAKING: అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి!

Advertisment
తాజా కథనాలు