BREAKING: అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి!

అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా మరోసారి సౌత్ కరోలినా రాష్ట్రంలో ఆదివారం తెల్లవారు జామున కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
South Carolina

South Carolina

గత కొన్ని రోజుల నుంచి అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా మరోసారి సౌత్ కరోలినా రాష్ట్రంలో ఆదివారం తెల్లవారు జామున కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స నిమిత్తం గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రంలో ఉన్న సెయింట్ హెలెనా ద్వీపంలోని ఒక రద్దీగా ఉండే బార్‌లో కొందరి మధ్య గొడవ జరగ్గా.. తీవ్రమై కాల్పులకు దారితీసింది. ఈ కాల్పుల్లో తీవ్రంగానే కొందరు గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: Yunus: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు.. యూనస్ ఏమన్నారంటే ?

ఇది కూడా చూడండి:La nina Effect: లానినా ఎఫెక్ట్.. ఈసారి చలి మాములుగా ఉండదు

Advertisment
తాజా కథనాలు