/rtv/media/media_files/2025/10/13/india-to-witness-colder-winter-this-year-2025-10-13-10-31-47.jpg)
India To Witness Colder Winter This Year
చలికాలం ప్రారంభమవుతోంది. సాయంత్రం త్వరగా చీకటి పడటం. ఉదయం 6 దాటిన కాస్త చీకటిగా ఉండటం లాంటివి కనిపిస్తున్నాయి. అయితే ఈ ఏడాది చలికాలం మరింత ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈసారి 20 డిగ్రీల కన్నా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. శీతల పరిస్థితులకు దారితీసే లానినా తిరిగి రావడం వల్ల ఈ సీజన్ చలి మరింత తీవ్రతరమవుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి లానినా అభివృద్ధి చెందే ఛాన్స్ ఉందని.. దీని ప్రభావం వల్ల తక్కవ ఉష్ణోగ్రతలు, ఎక్కువగా చలి గాలుల వీచే అవకాశం ఉందని తెలిపారు. ఇలాంటి వాతావరణ మార్పు గత ఆరేళ్లలో ఏర్పడటం ఐదోసారని పేర్కొన్నారు.
Also Read: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన అతి భారీ వర్షాలు
లానినా ఎఫెక్ట్ అంటే ఏంటి
ఒక రకమైన వాతావరణ మార్పునే లానినా అంటారు. దీన్ని ఎల్‌నినో సదరన్ ఆసిలేషన్ (NSO) అని కూడా పిలుస్తారు. దీని ప్రభావం వల్ల సెంట్రల్ ఈస్టర్న్ పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఉష్ణోగ్రతలు మారడం, వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం లాంటివి జరుగుతాయి. NSO అనేది ప్రపంచ వాతావరణాన్ని కూడా పూర్తిగా ప్రభావితం చేస్తుంది ఇది మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి వెచ్చగా (ఎల్‌నినో), రెండోది చల్లగా (లానినా), మూడోది న్యూట్రల్‌గా ఉంటుంది. ఇది దాదాపు రెండు నుంచి ఏడేళ్ల కాలంలో మళ్లీ మళ్లీ వస్తాయి.
Also Read: గాజాలో యుద్ధం ముగిసింది : ట్రంప్ అధికారక ప్రకటన
మరోవైపు ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) కూడా దీని గురించి గత నెలలో కీలక ప్రకటన చేసింది. లానినా మళ్లీ వచ్చినప్పటికీ ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు మాములు దానికన్నా ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. ఎల్‌నినోకు వ్యతిరేక వాతావరణ ప్రభావాలను లానినా తీసుకొస్తుందని పేర్కొంది. ఉష్ణమండల ప్రాంతాల్లో ఎల్‌నినో, లానినా సహజంగా జరిగే సంఘటనలని పేర్కొంది.