Pakistan Woman: నేపాల్ జైలు నుంచి తప్పించుకుని భారత్ లోకి పాక్ మహిళ.. ఆమె లక్ష్యం ఏంటి?

దక్షిణ త్రిపుర జిల్లాలోని సబ్రూమ్ సరిహద్దు పట్టణం నుండి మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న పాకిస్తాన్ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈమె నేపాల్ జైలు నుంచి పారిపోయినట్లు సమాచారం. బంగ్లాదేశ్ సరిహద్దు దాటి వెళ్లాలనే ఉద్దేశంతో వచ్చినట్లు తెలుస్తోంది.

New Update
Pakistan Woman

Pakistan Woman

దక్షిణ త్రిపుర జిల్లాలోని సబ్రూమ్ సరిహద్దు పట్టణం నుండి మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న పాకిస్తాన్ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈమె నేపాల్ జైలు నుంచి పారిపోయినట్లు సమాచారం. లూయిస్ నిఘాట్ అక్తర్ భానోగా అనే మహిళను ప్రభుత్వ రైల్వే పోలీసులు సబ్‌రూమ్ రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం ఆమెను స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించారని సబ్‌రూమ్ పోలీసు అధికారి నిత్యానంద సర్కార్ తెలిపారు. అయితే ఆ మహిళ బంగ్లాదేశ్ సరిహద్దు దాటి వెళ్లాలనే ఉద్దేశంతో వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె ఏ లక్ష్యంతో నేపాల్ జైలు నుంచి పారిపోయి వచ్చిందనే విషయంపై భద్రతా సంస్థలు విచారిస్తున్నాయి. నేపాల్ జైలు నుంచి పారిపోయి వచ్చిన ఈమెకు పాకిస్తాన్‌తో సంబంధాలు ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Crime: నువ్వేం తండ్రివి రా.. భార్య విడిచి వెళ్లిందనే కోపంతో ముగ్గురు పిల్లలను గొంతు కోసి హత్య

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా..

12 ఏళ్ల క్రితం పాకిస్తాన్ పాస్‌పోర్ట్ ఉపయోగించి నేపాల్‌లోకి ప్రవేశించి ఆమె మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ప్రారంభించింది. 2014లో నేపాల్‌లో ఒక కిలో బ్రౌన్ షుగర్ తీసుకెళ్లినందుకు ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమెకు 15 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఖాట్మండు జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆమె తప్పించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ గత నెల నేపాల్‌లో హింసాత్మక ఘటనలు జరిగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేపాల్ అంతటా నిరసనలు జరగ్గా.. దాదాపుగా 13 వేల మంది ఖైదీలు తప్పించుకున్నారు. వారిలో కొందరు భారత దేశంలోకి రావడానికి కూడా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆమె భారత్‌లోకి  ప్రవేశించగా పోలీసులు పట్టుకున్నారు. 

ఇది కూడా చూడండి: Crime News: దారుణం.. 14 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి.. వరి పొలంలో పాతిపెట్టిన దుర్మార్గుడు

Advertisment
తాజా కథనాలు