Canada Ex PM: కేటీ పెర్రీతో కెనడా మాజీ ప్రధాని..లాస్ ఏంజెలెస్ తీరంలో డేటింగ్..

కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో..పదవి నుంచి తప్పుకున్నాక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఫేమస్ పాప్ గాయనితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. తాజాగా లాస్ ఏంజెలెస్ లో శాంటి బార్బరా తీరంలో కేటీ పెర్రీ, ట్రూడోలు కిస్ చేసుకుంటున్న ఫొటోలు బయటకు వచ్చాయి. 

New Update
trudeau

కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో, పాప్ సింగర్ కేటీ పెర్రీ లు డేటింగ్ లో ఉన్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ కలసి ఉన్న ఫోటోలు బయటపడడంతో ఇది నిజమే అని అంటున్నారు. కాలిఫోర్నియాలోని శాంటా బార్బరా తీరంలో పెర్రీతో ఒక నౌకపై విహరిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అందులో చొక్కా లేకుండా ఉన్న ట్రూడో...స్విమ్ సూట్ లో ఉన్న పెర్రీని కిస్ చేస్తున్నట్లు అందులో ఉంది. 

జూలై నుంచి..

ఈ ఏడాది జులైలో  మొదటి సారిగా ట్రూడో, పెర్రీలు డేటింగ్ చేస్తున్నట్లు బయటకు వచ్చింది. మొదటి సారిగా వీరిద్దరూ మాంట్రియల్ లోని ఓ రెస్టారెంట్ లో కలిసి కనిపించారు. అక్కడ ఇద్దరూ రెండు గంటలపాటూ గడిపారు. అప్పటి నుంచీ వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం మొదలైంది. అయితే ట్రూడో , కేటీలు ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే కాలిఫోర్నియాలోని శాంటా బార్బరా తీరంలో ఓ ఖరీదైన నౌకపై ఇటీవల విహరించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. 

Advertisment
తాజా కథనాలు