Italy: ఆ దేశంలో బురఖా, నిఖాబ్ ధరించకూడదు..ప్రభుత్వ సంచలన నిర్ణయం
బహిరంగ ప్రదేశాల్లో మహిళలు బురఖాలు, నిఖాబ్ లు ధరించకూడదనే నిషేధానికి ఇటలీ ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. ఇస్లామిక్ వేర్పాటువాదాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించింది.
బహిరంగ ప్రదేశాల్లో మహిళలు బురఖాలు, నిఖాబ్ లు ధరించకూడదనే నిషేధానికి ఇటలీ ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. ఇస్లామిక్ వేర్పాటువాదాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించింది.
ఫిలిప్పీన్స్‌లోని మిండనోవా ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.6 గా నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మయన్మార్‌లోనూ శుక్రవారం ఉదయం 05:53:57 IST (భారత ప్రామాణిక సమయం)న 4.2 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది.
తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టిటిపి) స్థానాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఫైటర్ జెట్లు కాబూల్ నగరంలో వైమానిక దాడులకు తెగబడ్డాయి. దీంతో ఆఫ్ఘనిస్తాన్ రాజధాని పేలుళ్ల శబ్దంతో దద్దరిల్లింది. వైమానిక దాడులు జరిగినట్లు ఆఫ్ఘన్ అధికారులు ధృవీకరించారు.
షికాగోలో నేషనల్ గార్డ్స్ ను దింపాలనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నానికి అక్కడి ఫెడరల్ కోర్టు అడ్డుకట్ట వేసింది. గవర్నర్, మేయర్ అనుమతి లేకుండా నేషనల్ గార్డ్స్ మోహరించడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పింది.
లాస్ట్ ఇయర్ అజర్ బైజాన్ విమాన ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఆ విమాన ప్రమాదం తమ వల్లే జరిగిందని ఆయన అన్నారు. రష్యా ప్రయోగించిన క్షిపణుల వల్లనే ఫ్లైట్ దెబ్బ తిందని అంగీకరించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందేనని...దానికి ఆయన అన్ని విధాల అర్హుడంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంటున్నారు. ట్రంప్ కు నోబెల్ బహుమతిని తానే తొడుగుతున్నట్టుగా ఉన్న ఏఐ పిక్చర్ తో ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
గత మూడు రోజులుగా నోబెల్ బహుమతులను ప్రకటిసతున్నారు. రేపు పీస్ అవార్డ్ విన్నర్ ను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎనిమిది యుద్ధాలను ఆపానని చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను నోబెల్ వరిస్తుందా లేదా అన్నది చర్చనీయాంశం అయింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గాజా శాంతి ప్రణాళిక సక్సెస్ పై ఆయనను అందరూ ప్రశంసిస్తున్నారు. భారత ప్రధాని మోదీ కూడా ట్రంప్ కు ఫోన్ చేసి మరీ అభినందించారని తెలుస్తోంది.
బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌పై అమెరికా 50 శాతం టారిఫ్‌లు విధించడంతో ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా బ్రిటన్ ప్రధాని పర్యటనపై ప్రాధాన్యం సంతరించుకుంది.