BIG BREAKING: షేక్ హసీనాకు మరణశిక్ష.. బంగ్లాదేశ్‌ కోర్టు సంచలన తీర్పు

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ షాక్ తగిలింది. ఆ దేశంలో జరిగిన అల్లర్ల కేసులో ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది.

New Update
BREAKING

BREAKING

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ షాక్ తగిలింది. ఆ దేశంలో జరిగిన అల్లర్ల కేసులో ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. మానవత్వానికి వ్యతిరేకంగా ఆమె నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆమెపై అనేక కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ కోర్టు సోమవారం దీనిపై విచారణ జరపగా షేక్ హసీనాను దోషిగా తేల్చింది. ఈ క్రమంలోనే ఆమెకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. 

 గతేడాది బంగ్లాదేశ్‌లో అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో 1400 మంది మృతి చెందినట్లు ఐసీటీ న్యాయమూర్తి తెలిపారు. తనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వాళ్లని చంపేయాలని ఆమె ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. ఈ కేసులో మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్‌ ఖాన్‌కు కూడా న్యాయస్థానం మరణశిక్ష విధించింది.   

షేక్ హసీనా అధికారంలో ఉండేందుకు బలప్రయోగం చేశారని.. తీర్పు ఇవ్వడంలో ఆలస్యం జరిగినట్లయితే క్షమించాలని కోరారు. మరోవైపు కోర్టు తీర్పు నేపథ్యంలో బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో హై టెన్షన్ నెలకొంది. ఇప్పటికే ఐటీసీ చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎవరైనా వాహనాలు తగలబెట్టడం, బాంబులు విసిరేందుకు ప్రయత్నంచడం లాంటివి చేస్తే వాళ్లని కాల్చేయాలంటూ ఢాకా పోలీస్ చీఫ్‌ షేక్‌ మహమ్మద్ సజ్జత్ ఆదేశించారు. 

ఇదిలాఉండగా గతేడాది జరిగిన అల్లర్లు హింసాత్మక ఘటనలకు దారి తీసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ఏడాది ఆగస్టు 5న షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి అక్కడి నుంచి పారిపోయి భారత్‌కు వచ్చారు. అప్పటినుంచి ఆమె ఢిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో ఉంటున్నారు. ఈ తీర్పుకు ముందు కూడా ఆమె తన దేశ ప్రజలను ఉద్దేశించి ఓ సందేశం విడుదల చేశారు. '' నేను బ్రతికే ఉన్నాను. ప్రజల కోసం నా పనిని ప్రారంభిస్తాను. వాళ్లు ఏ తీర్పు ఇచ్చిన నాకు సంబంధం లేదు. దేవుడు ఇచ్చిన ప్రాణాన్ని ఆయనే తీసుకుంటాడు. అప్పటిదాకా నేను ప్రజలకు సేవ చేస్తాను. ఈ దేశం కోసం నా తల్లిదండ్రులు, తోబుట్టువులను కోల్పోయాను. వాళ్లు నా ఇంటిని కాల్చేశారు. దేశ ప్రధానమంత్రి అధికార నివాసం కూడా నా ఆస్తి కాదు. అది ప్రభుత్వానిది. నేను దేశం నుంచి వెళ్లిపోయాక అందులో లూటీ జరిగింది. కానీ వాళ్లు మాత్రం ఇది విప్లవం అని చెబుతున్నారు. గుండాలు, ఉగ్రవాదులు విప్లవాన్ని తీసుకురాలేరని'' షేక్ హసీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisment
తాజా కథనాలు