Saudi Arabia Bus Accident: వణుకుపుట్టించే వీడియోలు.. సౌదీ బస్సు ప్రమాదం విజువల్స్ చూశారా..

సౌదీ అరేబియాలో ఘోరమైన బస్సు అగ్ని ప్రమాదం జరిగింది. భారతీయులతో నిండిన ఒక బస్సు మక్కా నుండి మదీనాకు ప్రయాణించిన సమయంలో డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో సెకన్ల వ్యవధిలో వెంటనే మంటలు అంటుకుని బస్సు మొత్తం కాలి బూడిదైంది.

New Update
Saudi Arabia Bus Fire Accident videos (1)

Saudi Arabia Bus Fire Accident videos

ఇవాళ సౌదీ అరేబియాలో ఘోరమైన బస్సు అగ్ని ప్రమాదం జరిగింది. భారతీయులతో నిండిన ఒక బస్సు మక్కా నుండి మదీనాకు ప్రయాణించిన సమయంలో డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో సెకన్ల వ్యవధిలో వెంటనే మంటలు అంటుకుని బస్సు మొత్తం కాలి బూడిదైంది. ఈ ప్రమాద తీవ్రత భారీ స్థాయిలో ఉండటంతో దాదాపు 42 మంది భక్తులు సజీవదహనం అయ్యారు. ఉమ్రా యాత్ర ముగించుకుని మక్కా నుండి మదీనాకు బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ముఫ్రిహాత్ సమీపంలో తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో ఇది చోటుచేసుకుంది.  

Saudi Arabia Bus Fire Accident videos

మృతుల్లో హైదరాబాద్‌కు చెందినవారే ఎక్కువ మంది ఉన్నట్లు సమాచారం. దాదాపు 18 మంది హైదరాబాద్ వాసులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత, ప్రాణాలతో బయటపడిన 4 మందిని మదీనాలోని అల్-హమ్నా ఆసుపత్రికి తరలించారు. సౌదీ అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. కాగా ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో భయం పుట్టిస్తున్నాయి. 

Advertisment
తాజా కథనాలు