BIG BREAKING: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 42 మంది మృతి.. హైదరాబాద్ వాసులే ఎక్కువ!

సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా.. బదర్-మదీనా ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీకొట్టడంతో స్పాట్‌లోనే 42 మంది మృతి చెందారు. వీరిలో హైదరాబాద్‌ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
BREAKING

BREAKING

సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా.. బదర్-మదీనా ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్పాట్‌లోనే 42 మంది సజీవ దహనమయ్యారు. వీరిలో 20 మంది మహిళలు ఉండగా.. 11 మంది చిన్నారులు ఉన్నారు. ఎక్కువగా వీరిలో హైదరాబాద్‌ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కంట్రోల్ రూమ్ నంబర్లు..

ఈ బస్సు ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం, సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని రేవంత్ సూచించారు. బాధిత కుటుంబాలకు సాయం అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్, విదేశాంగశాఖ అధికారులతో సీఎం మాట్లాడారు. హెల్ప్‌లైన్ కోసం సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వివరాల కోసం 79979 59754, 99129 19545 కంట్రోల్ రూం నంబర్లకు కాల్ చేయాలని తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు