BREAKING: సౌదీ అరేబియా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం

సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని తెలంగాణ సర్కార్ ప్రకటించింది.

New Update
Saudi Arabia Bus Accident

Saudi Arabia Bus Accident

సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతలందరూ హైదరాబాద్‌ వాసులేనని హజ్‌ కమిటీ వెల్లడించింది. ఈ ఘటనపై మృతుల కుటుంబాలకు తెలంగాణ మంత్రివర్గం సంతాపం తెలిపింది. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది. అలాగే మంత్రి అజారుద్దీన్, MIM ఎమ్మెల్యే, మైనార్టీ విభాగానికి చెందిన ఓ అధికారితో కలిసి ప్రభుత్వ ప్రతినిధి టీమ్‌ను సౌదీకి పంపించాలని సూచనలు చేసింది. 

Also Read: సౌదీలో మరణిస్తే మృతదేహాన్ని ఇవ్వరు.. ఈ రూల్‌ గురించి తెలుసా ?

మృతులకు మత సంప్రదాయాల ప్రకారం అక్కడే అంత్యక్రయలు నిర్వహించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లోని బాధిత కుటుంబ సభ్యుల్లో ఒక్కో కుటుంబానికి ఇద్దరిని తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇదిలాఉండగా మక్కా యాత్ర ముగించుకుని మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  డీజిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు మొత్తం మంటలు అంటుకోవడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. మృతుల్లో 18 మంది మహిళలు, 17 మంది పురుషులు, 10 మంది చిన్నారులు ఉన్నారు. 

Advertisment
తాజా కథనాలు