/rtv/media/media_files/2025/11/17/fotojet-2025-11-17t072322558-2025-11-17-07-23-46.jpg)
Gen Z protest turns violent in Mexico...over 100 people...
Gen Z protesting : నేపాల్‌లో రాజకీయ నాయకుల అవినీతిపై మొదలైన జెన్ జెడ్ ఉద్యమం ప్రపంచమంతా విస్తరిస్తోంది. తాజాగా దేశంలో నానాటికీ పెరుగుతున్న నేరాలు, అవినీతికి వ్యతిరేకంగా మెక్సికోలో వేలాది మంది జెన్-జడ్ యువత చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షిన్‌బామ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది యువత రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. నేరాలు, హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని యువకులు మండిపడ్డారు. ఈ క్రమంలోనే అధ్యక్ష భవనమైన నేషనల్ ప్యాలెస్‌లోకి దూసుకెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. ప్యాలెస్ చుట్టూ ఉన్న ఇనుప కంచెలను ధ్వంసం చేశారు.దీంతో పోలీసులు, నిరసనకారల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రాళ్లు, కర్రలు, తాళ్లు, మండేపదార్థాలతో పోలీసులపై జెన్-జడ్ దాడి చేసింది. ఈ ఘర్షణలో దాదాపు 120మంది గాయపడగా..వారిలో 100మంది పోలీసు అధికారులే.
నేపాల్‌లో మొదలైన జెన్ జెడ్ ఉద్యమంతో రోడ్లపైకి వచ్చిన యువత రాజకీయ నాయకుల అవినీతి, అక్రమాలపై ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. జెన్ జెడ్ ధాటికి నేపాల్‌లో కేపీ ఓలీ ప్రభుత్వం కూలిపోయింది. సుశీల కర్కి నేతృత్వంలో నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వం కొలువు దీరింది. అయితే జెన్ జెడ్ చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ హింసలో 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. ఇప్పుడు ఈ జెన్ జెడ్ ఉద్యమం ఉత్తర అమెరికాను తాకింది. తాజాగా మెక్సికోలో వేలాది మంది యువత రోడ్లపైకి వచ్చిన ఆందోళనలు చేశారు. దేశ అధ్యక్షురాలు క్లాడియా షిన్‌బామ్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే అధ్యక్ష భవనమైన నేషనల్ ప్యాలెస్‌లోకి దూసుకెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు నిరసనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.మెక్సికో సిటీలో జెన్ జెడ్ యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో నిరసనకారులపైకి టియర్ గ్యాస్ ప్రయోగించారు. కాగా, ఈ ఘర్షణల్లో 100 మంది పోలీసులకు గాయాలయ్యాయని సిటీ సిటిజెన్ సేఫ్టీ సెక్రటరీ పాబ్లో వాజ్‌క్వెజ్ చెప్పారు. మరో 20 మంది యువత కూడా గాయపడ్డాని తెలిపారు. ఇప్పటికే 20 మంది నిరసనకారులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
అసలేం జరిగిందంటే...
నవంబర్ 1న మెక్సికో పశ్చిమ రాష్ట్రమైన మికోకాన్‌లోని ఉరుపాన్ నగర మేయర్.. కార్లోస్ మంజో దారుణ హత్యకు గురయ్యాడు. నేరాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆయనను ‘డే ఆఫ్ ది డెడ్’ అనే ఓ బహిరంగ కార్యక్రమంలో దుండగులు కాల్చి చంపారు. ఈ దారుణ హత్య దేశవ్యాప్తంగా యువతలో తీవ్ర ఆగ్రహావేశాల్ని రేపింది. ప్రభుత్వాలు హింసను అరికట్టడంలో విఫలమయ్యాయంటూ నిరసనలకు దిగారు. మెక్సికో సిటీతో పాటు పలు నగరాల్లో వేలాది మంది యువత ప్రదర్శనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో అధ్యక్ష భవనం ముట్టడికి ప్రయత్నించారు. కాగా, షీన్‌బామ్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో.. ఆమెకు 70 శాతానికి పైగా అప్రూవల్ రేటింగ్ ఉంది. అయితే, దేశంలో హింసను అరికట్టడంలో విఫలమవుతున్నారని.. ఆమె తరచుగా తీవ్ర విమర్శలకు గురవుతున్నారు.
Follow Us