Sheikh Hasina: మరణశిక్షపై స్పందించిన షేక్ హసీనా

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష పడిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా షేక్ హసీనా స్పందించారు. కోర్టు తీర్పు మోసపూరితమైనదని ఆరోపించారు. ప్రజలు ఎన్నుకోకుండా ఏర్పడ్డ ప్రభుత్వం తనకు కావాలనే కుట్రపూరితంగా శిక్ష పడేలా చేశారని మండిపడ్డారు.

New Update
Sheikh Hasina

Sheikh Hasina

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష పడిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌ అల్లర్ల కేసుల్లో మానవత్వానికి వ్యతిరేకంగా పాల్పడినందుకు ఆ దేశ ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌(ICT) ఆమెను దోషిగా తేల్చింది. ఈ మేరకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పుపై తాజాగా షేక్ హసీనా స్పందించారు. ఈ తీర్పు మోసపూరితమైనదని ఆరోపించారు. ప్రజలు ఎన్నుకోకుండా ఏర్పడ్డ ప్రభుత్వం తనకు కావాలనే కుట్రపూరితంగా శిక్ష పడేలా చేశారని మండిపడ్డారు. కనీసం తనను తాను నిరూపించుకునేందుకు కోర్టు ఛాన్స్ ఇవ్వలేదని వాపోయారు. న్యాయమూర్తులు కూడా ఈ విషయంలో పక్షపాతం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: సౌదీలో మరణిస్తే మృతదేహాన్ని ఇవ్వరు.. ఈ రూల్‌ గురించి తెలుసా ?

అంతేకాదు మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి కోర్టు చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవని తెలిపారు. తమ దేశంలో విద్య, ఉద్యోగాలు, పేదరిక నిర్మూలణ, అభివృద్ధి లాంటి అనేక విషయాల్లో ఎన్నో చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. 2010లో బంగ్లాదేశ్‌ను ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో చేరేలా తమ ప్రభుత్వమే నడిపించిందని తెలిపారు. మయన్మార్‌లో హింస జరిగినప్పుడు బంగ్లాదేశ్‌కు వచ్చిన లక్షలాది మంది రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించామని పేర్కొన్నారు.

Also Read: ఉగ్ర నెట్‌వర్క్‌లోబిగ్‌ ట్విస్ట్‌..‘ఆపరేషన్‌ డీ-6’పేరుతో 6 నగరాల్లో విధ్వంసం?

 తమకు మానవ హక్కుల పట్ల శ్రద్ధ లేకుంటే ఇలాంటివి ఎందుకు చేస్తామంటూ ప్రశ్నించారు. ఇదిలాఉండగా.. షేక్ హసీనాకు కోర్టు మరణశిక్ష విధించడంతో బంగ్లాదేశ్‌లో హైఅలెర్ట్ నెలకొంది. ఇప్పటికే పోలీసులు ఢాకాలో భద్రతను కట్టుదిట్టం చేశారు.  ఎవరైనా వాహనాలు తగలబెట్టడం, బాంబులు విసిరేందుకు యత్నించడం లాంటివి చేస్తే వాళ్లని కాల్చేయాలని ఢాకా పోలీస్ చీఫ్‌ షేక్‌ మహమ్మద్ సజ్జత్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు హసీనాకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో అవామీ లీగ్ పార్టీ మంగళవారం దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది. ప్రస్తుతం హసీనా భారత్‌లోని ఢిల్లీలో ఓ రహస్య ప్రాంతంలో ఉంటోంది. దీంతో బంగ్లాదేశ్‌లో ఉన్న యూనస్‌ ప్రభుత్వం కూడా హసీనాను తమకు అప్పగించాలని తాజాగా భారత్‌కు లేఖ రాసింది. 

Advertisment
తాజా కథనాలు