Bali Boat Capsized: బోటు బోల్తా.. నలుగురు మృతి - 61 మంది గల్లంతు
ఇండోనేషియాలోని రిసార్ట్ ద్వీపం బాలిలో ఘోరమైన ప్రమాదం చోటుచేసుకుంది. 65 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మందిని రక్షించగా.. 38 మంది కోసం రెస్క్యూ టీం వెతుకుతుంది.