Green Card: గ్రీన్ కార్డ్ కూ కష్టాలు...లాటరీ ప్రోగ్రామ్ ను నిలిపేసిన ట్రంప్ ప్రభుత్వం

గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ కూడా నిలిచిపోయింది. దాని లాటరీని ఆపేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. బ్రౌన్ యూనివర్శిటీలో కాల్పులు ఘటనకు ఈ గ్రీన్ కార్డ్ ప్రోగ్రామే కారణం అయిందని యూఎస్ ప్రభుత్వం భావిస్తోంది.

New Update
green card

గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నవాళ్ళకు నిరాశ ఎదురవనుంది. ఇప్పటికే ఆ క్యూలో ఉండి...ఏళ్ళ తరబడి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎప్పటికైనా వస్తుందనే ఆశతో ఉంటున్నారు. ఇప్పుడు అది కూడా పోయింది. గ్రీన్ కార్డ్ లాటరీని నిలిపేయాలని ట్రంప్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఈ ప్రోగ్రామ్‌ను నిలిపివేయాలని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్‌ను ఆదేశించారు. రీసెంట్ గా అమెరికాలోని బ్రౌన్ యూనివర్శిటీలో కాల్పులు ఘటన చోటు చేసుకుంది. ఇందులో ఇద్దరు మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. దీనికి కారణమైన పోర్చుగీస్‌ జాతీయుడైన నిందితుడు యూఎస్ లోకి రావడానికి ఈ గ్రీన్ కార్డ్ ప్రోగ్రామే కారణమని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇప్పుడు దానిని నిలిపేయాలని అనుకుంది. ఇలాంటి దారుణమైన వ్యక్తులను మన దేశంలోకి ఎన్నటికీ అనుమతించకూడదు అని క్రిస్టీ నోయెమ్ తన పోస్ట్ లో ప్రత్యేకంగా రాయడం గమనార్హం.

డైవర్శిటీ వీసానే గ్రీన్ కార్డ్..

డైవర్శిటీ వీసానే గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రామ్ అంటారు. ఈ ప్రోగ్రామ్ కింద ప్రతీ ఏడాది 55 వేల మందిని సెలెక్ట్ చేస్తారు. ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ కింద స్టేట్ డిపార్ట్‌మెంట్‌ ఈ డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్‌ పనితీరును పర్యవేక్షిస్తుంది. అమెరికా వచ్చే ఇతర జాతీయులు, విదేశీయులకు దీనిని ఇస్తుంటారు. గ్రీన్ కార్డ్ ఉంటే దాదాపుగా అమెరికా పౌరసత్వం ఉన్నట్టే. ఇది వచ్చిన ఆరేడేళ్ళకు అమెరికా సిటిజెన్ షిప్ కు కూడా అప్లైచేసుకోవచ్చును. అందుకే దీనికి అంత డిమాండ్. గ్రీన్ కార్డ్ లాటరీ కోసం ఏళ్ళ తరబడి లక్షల్లో విదేశీయులు ఎదురు చూస్తుంటారు. లాటరీలోకి ఎంటర్ అయిన తర్వాత అది రావడానికి 10 నుంచి 20 ఏళ్ళ టైమ్ పట్టవచ్చును. అయితే ఒకసారి అందులోకి ప్రవేశిస్తే చాలు అమెరికాలో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. హెచ్ 1 వీసా ఆటోమాటిక్ గా రెన్యువల్ అవుతూ ఉంటుంది. ఈ గ్రీన్ కార్డ్ కోసం ఇప్పటికే చాలా మంది ఏళ్ళ తరబడి వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు లాటరీ తీసేయడం...అలాంటి వారందరికీ పెద్ద దెబ్బే అవుతుంది. అయితే ఇందులో ఒక చిన్న నిట్టూర్పు ఏంటంటే..మొత్తంగా గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నే ఎత్తేయలేదు. అస్సలు ఎప్పటికీ అవి ఇంక ఎవ్వరికీ ఇవ్వము అని చెప్పలేదు. లాటరీని అయితే తీసేస్తున్నారు. దీని తరువాత ఎలా గ్రీన్ కార్డులను జారీ చేస్తారు అనేది యూఎస్ గవర్నమెంట్ ఇంకా అనౌన్స్ చేయలేదు.

Advertisment
తాజా కథనాలు