/rtv/media/media_files/2025/12/19/pakistani-citizens-2025-12-19-13-37-32.jpg)
అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్(Pakistani citizens) ప్రతిష్ట మరోసారి గల్ఫ్ దేశాల్లో మట్టికలిసింది. దాదాపు 24,000 మంది పాకిస్థానీయులను సౌదీ ప్రభుత్వం ఈ ఏడాది అక్కడి నుంచి బహిష్కరించింది. వీరంతా ఉమ్రా, పర్యాటక వీసాల పేరుతో సౌదీ అరేబియాకు చేరుకుని, అక్కడ వ్యవస్థీకృత ముఠాలుగా ఏర్పడి భిక్షాటనకు పాల్పడుతున్న గుర్తించారు. ఇస్లామాబాద్(islamabad)కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాకే సౌదీ ఈ కఠిన చర్యలు చేపట్టింది.
Also Read : పార్లమెంట్‌లో ‘శాంతి’ బిల్లు ఆమోదం.. న్యూక్లియర్ రంగంలో కీలక మార్పులు!
వీసాల దుర్వినియోగం
సౌదీ అరేబియా(saudi-arabia) లోని మక్కా, మదీనా వంటి పవిత్ర నగరాల్లో భిక్షాటన(Pakistani Beggars) అక్కడి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. పాకిస్థాన్ నుంచి వచ్చే టూరిస్టులు 'ఉమ్రా' వీసాలను అడ్డం పెట్టుకుని భిక్షాటనకు దిగుతున్నారని సౌదీ నిఘా సంస్థలు గుర్తించాయి. ఇది కేవలం పేదరికంతో చేస్తున్న పని కాదని, దీని వెనుక పెద్ద 'బెగ్గర్ మాఫియా' పని చేస్తోందని పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా అంగీకరించింది. ఈ ముఠాల కదలికలు నియంత్రించే క్రమంలో పాకిస్థాన్ విమానాశ్రయాల్లోనే దాదాపు 66,000 మంది అనుమానిత ప్రయాణికులను అధికారులు నిలిపివేశారు.
సౌదీ గవర్నమెంట్ వార్నింగ్
గతేడాది నుంచే సౌదీ అరేబియా ఈ విషయంలో పాకిస్థాన్‌ను హెచ్చరిస్తూ వస్తోంది. "మీ దేశం నుంచి వచ్చే భిక్షగాళ్లను అదుపు చేయకపోతే, భవిష్యత్తులో హజ్ మరియు ఉమ్రా కోటాపై ప్రభావం పడుతుంది" అని సౌదీ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సౌదీ జైళ్లలో మగ్గుతున్న విదేశీ యాచకులలో దాదాపు 90 శాతం మంది పాకిస్థానీలే ఉండటం గమనార్హం. కేవలం సౌదీ అరేబియా మాత్రమే కాకుండా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా పాకిస్థానీలపై కఠినమైన వీసా ఆంక్షలను విధించింది. దుబాయ్ వంటి నగరాల్లో నేరాలు, భిక్షాటన పెరగడానికి పాక్ పౌరులే కారణమని భావిస్తూ, కొత్త వీసాల జారీని తగ్గించింది. ఇతర దేశాలైన అజర్‌బైజాన్ (2,500 మంది), ఖతార్, ఒమన్ కూడా ఇదే దారిలో పయనిస్తున్నాయి.
Also Read : మాదక ద్రవ్యాల నుంచి చమురుకు.. ముదిరిన అమెరికా, వెనిజులా యుద్ధం..
పాక్ ప్రతిష్టకు భంగం
పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహిసిన్ నక్వీ ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. "ఈ బెగ్గర్ మాఫియా వల్ల ప్రపంచవ్యాప్తంగా పాకిస్థాన్ పరువు పోతోంది. విదేశాల్లో మన దేశ ప్రతిష్ట దెబ్బతింటోంది" అని ఆయన పేర్కొన్నారు. దీనిని అరికట్టేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు సంస్థలను రంగంలోకి దించింది. ఈ బహిష్కరణల వల్ల విదేశాల్లో ఉంటున్న సాధారణ పాక్ కార్మికులపై కూడా వీసా నిబంధనల ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
Follow Us