Bangladesh-India: అట్టుడుకుతున్న బంగ్లాదేశ్..భారత్ తో పెరుగుతున్న దూరం

ఇప్పటికే భారత్, బంగ్లాదేశ్ ల మధ్య దూరం పెరిగింది. దౌత్య పరంగా రెండు దేశాలూ కలిసి ముందు సాగడం లేదు. ఇలాంటి సమయంలో తాజా బంగ్లా అల్లర్లు, ఉస్మాన్ హదీ మృతి ఈ దూరాన్ని మరింత పెంచుతుందని అంటున్నారు.

New Update
bangla

బంగ్లాదేశ్‌(bangladesh-riots) లో మరోసారి హింసాత్మక నిరసనలు మిన్నంటాయి. దేశవ్యాప్త ప్రజా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువ నేత, ఇంక్విలాబ్ మంచా ప్రతినిధి షరీఫ్ ఓస్మాన్హాదీ(Osman Hadi death) మరణవార్త తెలియడంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. నిరసనకారులు ఆగ్రహంతో మాజీ ప్రధాని షేక్ హసీనా(Bangladesh Ex PM Sheikh Hasina) కు చెందిన అవామీ లీగ్ కార్యాలయాలకు నిప్పు పెట్టడమే కాకుండా, ప్రముఖ వార్తాపత్రికల కార్యాలయాలపై కూడా దాడులకు తెగబడ్డారు. చిట్టగాంగ్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం వెలుపల కూడా నిరసనాకారులు భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హదీ హత్య వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉందని వాళ్లు ఆరోపణలు చేస్తున్నారు.

గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులు చేయగా చనిపోయిన యువనేత ఉస్మాన్ హదీ విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా ఈయన గళం వినిపించేవాడు. అలాగే బంగ్లాదేశ్ సార్వభౌమాధికారంపై విదేశీ శక్తుల ప్రభావం ఉండకూడదని పోరాడేవాడు. ఇక షేక్ హసీనా ప్రభుత్వం పతనానికి దారితీసిన ఉద్యమంలో హదీ కీలక పాత్ర పోషించారు. అందుకే ఇప్పుడు అతను చనిపోయాక బంగ్లాదేశ్ ప్రజలు భారత్ కు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తున్నారు. అల్లర్లు సృష్టిస్తున్నారు. హసీనా ప్రభుత్వం కూలిపోయిన అనంతరం ఇంకిలాబ్మంచ్ అనే రాజకీయ వేదికకు ఆయన కన్వీనర్‌గా, అధికార ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించారు.

Also Read :  గ్రీన్ కార్డ్ కూ కష్టాలు...లాటరీ ప్రోగ్రామ్ ను నిలిపేసిన ట్రంప్ ప్రభుత్వం

భారత్ కు వ్యతికేంగా యూనస్..

బంగ్లాదేశ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలాకజరిగబోయే మొదటి ఎన్నికలు ఇవి. ఈ నేపథ్యంలో ఉస్మాన్ హదీ హత్యకు గురికావడం, అల్లర్లు చెలరేగడం వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ దేశంతో పాటూ భాగస్వామ్య దేశమైన భారత్ గురించి కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది. బంగ్లాదేశ్ ఒకప్పుడు సహజ భాగస్వామి, భారతదేశంతో స్నేహపూర్వక సంబంధం కలిగి ఉన్న పొరుగు దేశం. కానీ గత ఏడాది నుంచి సీన్ రివర్స్ అయింపోయింది. విద్యార్థుల నిరనలు, హింసాత్మక ఘటనలు, షేక్ హసీనా దేశం వదిలి పారిపోవడం, ఆమె భారత్ లో తలదాచుకోవడం వంటివి రెండు దేశాలకూ మధ్య దూరాన్ని పెంచాయి. షేక్ హసీనాను బంగ్లాదేశ్ అప్పగించాలని కోరుతున్నా..భారత్ అందుకు నిరాకరిస్తోంది. దానికి తోడు తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ కూడా భారత్ తో కంటే పాకిస్తాన్ తోనే ఎక్కువ స్నేహాన్ని కోరారు. ఇది ఇండియా, బంగ్లాల మధ్య దూరం పెరిగేందుకు దోహదపడింది. పాకిస్తాన్(pakistan) తో కలిసి బంగ్లాదేశ్ కుట్రలు చేస్తోందని తెలుస్తోంది. అలాగే ఈశాన్య రాష్ట్రాల విషయంలో చైనాకు అనుకూలంగా మాట్లాడడం వంటివి కూడా దౌత్య సంబంధాలను దెబ్బ తీశాయి.

ఇప్పుడు తాజాగా ఉస్మాన్ హదీహత్య..దాని వెనుక విదేశీ హస్తం ఉంది అనిఅనుమానం..అతను ప్రత్యేకంగా భారత్(india) కు వ్యతిరేకి కావడం లాంటివి అన్నీ ఇండియా, బంగ్లాదేశ్ మధ్య దూరాన్ని మరింత శాశ్వతం చేస్తాయా అనే అనుమానాన్ని బలపేతం చేస్తున్నాయి.. దాంతో పాటూ ఆ దేశ అల్లర్లు మన దేశానికీ పాకే అవకాశం ఉందనే ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది. ఈ అల్లర్లలో ఓ హిందూ వ్యక్తిని అల్లరి మూకలు హత్య చేశాయి. మ్యాటర్ మొత్తం అంతా షేక్ హసీనా వైపు తిరిగి..భారత్ మీద ఆదేశం ఒత్తిడి తీసుకురావచ్చని విశ్లేషకులు అంటున్నారు. హసీనాను అప్పగించడానికి భారత్ అంగీకరించకపోతే..పెద్ద గొడవే అవుతుందని చెబుతున్నారు. బంగ్లాదేశ్‌ అంతర్గత వ్యవహారాల్లో భారత్‌ జోక్యం చేసుకోనప్పటికీ.. ఆ దేశం మాత్రం భారత వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోంది.

Also Read :  బంగ్లాదేశ్‌లో మళ్లీ అల్లర్లు.. రాత్రికి రాత్రే అల్లకల్లోలం

బంగాళాఖాతంలో కవ్వింపు..

ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరోవైపు బంగ్లాదేశ్...రెండు దేశాలకు మధ్య ఉన్న బంగాళాతంలోకవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత్ ను రెచ్చగొడుతోంది. ఆ దేశానికిచెందినచేపలబోట్లుతరచూభారతప్రాదేశికజలాల్లోకిచొచ్చుకు రావడం, ఎన్నడూ లేని విధంగా బంగ్లా నేవీ కూడా ఈ ప్రాంతంలో గస్తీ పెంచడం దీనికి బలం చేకూరుస్తోంది. ఈ ప్రాంతం మొత్తానికి బంగ్లాదేశ్‌ సముద్ర రక్షకురాలు అంటూ గతంలో యూనస్‌ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు తగినట్లుగానే బంగ్లా నేవీ.. సముద్ర సరిహద్దు ప్రాంతాల్లో గస్తీ తీవ్రం చేసింది. భారత్‌ మత్స్యకారులను నిర్బంధించడం, వారి బోట్లను స్వాధీనం చేసుకోవడం, కోస్ట్‌గార్డ్‌ సిబ్బందితో కవ్వింపులకు దిగడం వంటి చర్యలకు పాల్పడుతోంది.

Advertisment
తాజా కథనాలు