Year Ender 2025: నానో బనానా నుండి కిస్ క్యామ్ హాడావుడి వరకూ..2025లో సోషల్ మీడియాను షేక్ చేసిన ట్రెండ్స్..

2025 సంవత్సరం చాలా తొందరగా గడిచి పోయింది. ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పూర్తయిందో తెలియని కాలంలో కూడా కొన్ని సంఘటనలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఆన్ లైన్ కు కట్టిపడేసేలా చేశాయి. అవేంటో కింది కథనంలో చూసేయండి.

New Update
internet

2025 అంతా ఏఐ ఏడాదిగా మారిపోయింది. జెమిని, పెర్ ప్లెక్నిటీ, గ్రోక్, డీప్ సీక్ ఇలా రకరకాల ఏఐ టూల్స్ తో ఇంటర్నెట్ షేక్ అయింది. వాటికి తోడు నానో బనానా, గిబ్లి స్టైల్ లాంటివి జనాలను కంప్యూటర్ దగ్గర నుంచి కదలకుండా చేశాయి. టెక్నాలజీ పరంగా ఇవి అయితే...ప్రపంచం మొత్తాన్ని ఇంటర్నెట్ కు అతుక్కుపోయేలా చేసిన విషయం మాత్రం కిస్ కామ్ చావోస్. ఇక వార్తల్లో ఎక్కవుగా నిలిచినది అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ ఏడాది అమెరికా అధ్యక్షుడిగా ఆయన పదవి చేపట్టిన దగ్గర నుంచీ ఒక్కరోజు కూడా వార్తల్లో కనిపించకుండా ఉండలేదు. రోజుకో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ సెన్సేషనల్ అయిపోయారు ట్రంప్.

నానో బనానా ట్రెండ్..

టెక్నాలజీలోరోజుకో కొత్త వింత పుట్టుకొస్తోంది. తరువాత ట్రెండ్ అయి జనాలను తన చుట్టూ తిప్పుకుంటోంది. గూగుల్ జెమిని(google-gemini-ai) కొన్ని రోజుల క్రితం నానో బనానా(Nano Banana) పేరుతో ఏఐ ఇమేజ్ ఎడిటింగ్ టూల్ ను విడుదల చేసింది. ఇది కాస్తా సూపర్ హిట్ అయింది. జనాలు పిచ్చిగా దీన్ని డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇదొక ఏఐ ఇమేజ్ టూల్. గూగుల్ దీన్ని లాంచ్ చేసింది. నిజానికి నానో బానానా అనే పేరును ఇంటర్నెట్ లోనే సృష్టించబడి..ట్రెండ్ అయింది. ఈ టూల్ లో టెక్స్ట్ ప్రాంప్ట్ లేదా ఫోటోలుఇస్తే..వాటితోరియలిస్టిక్ గా ఉండే త్రీడీ ఫిగరిన్లను తయారు చేసి ఇస్తుంది. ఇవి చిన్న బొమ్మల్లా కనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే పిల్లలు ఆడుకునే కలెక్టబుల్టాయ్స్ లా ఉంటాయి. ఎలాంటి ఫోటోను అయినా ఈ ఏఐ టూల్ తో త్రీడీ ఫిగరిన్ గా మార్చవచ్చును. ఇప్పటికి ఈ ఏఐ టూల్ 200 మిలియన్ల కంటే ఎక్కువ ఫోటోలను సృష్టించింది. నిమిషాల్లోనే త్రీడీ బొమ్మలను తయారు చేసి ఇస్తోంది. మిగతా ఏఐయాప్స్కంటే ఈ గూగుల్ జెమినీ 2.5 వెర్షన్ వేగంగా ఉండి అందరినీ ఆకట్టుకుంది.

పిచ్చెక్కించినగిబ్లీ స్టైల్..

ఈ AI టెక్నాలజీ ద్వారా వినియోగదారులు తక్కువ సమయంలోనే తమ ఫోటోలను యానిమేషన్ రూపంలోకి మార్చుకోవచ్చు. ముఖ్యంగా X (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ చిత్రాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గిబ్లీ స్టైల్ అనేది జపాన్‌కు చెందిన ప్రముఖ యానిమేషన్ స్టూడియో. చాట్‌జీపీటీలో లేటెస్ట్‌ వెర్షన్‌లోకి వెళ్లి మీరు కోరుకున్న ఇమేజ్‌ను గిబ్లీఫైఅని గానీ, గిబ్లీ థీమ్‌లోకి మార్చమని గానీ ప్రాంప్ట్‌ ఇస్తే వెంటనే ఆ ఇమేజ్‌ను గిబ్లీ స్టైల్‌లోకి మార్చి ఇస్తుంది. ఇది చాలా కొద్ది రోజుల్లోనే బాగా పాపులర్ అయింది. దీంతో మిగతా ఏఐ ప్లాట్ ఫామ్ లు అయిన గూగుల్ జెమినీ, గ్రోక్ లు కూడా ఈ ట్రెండ్ ప్రవేశ పెట్టాయి. అయితే గిబ్లీ ఎంత తొందరగా వచ్చిందో అంత తొందరగానే మాయం అయిపోయింది. దీనిలో ఫోటోలు ఇవ్వడం డేంజర్. అని మన పర్శనల్ సమాచారాన్ని అందరికీ అందుబాటులో పెడుతున్నామని హెచ్చరించే సరికి యూజర్లు దీనిని వాడడం మానేశారు.

6-7 పదం..

జెన్ జీ ని ఊపేసిన పదం ఇది. ఎవరూ పుట్టించినదే కొత్త పదాలు ఎలా వస్తాయి అని ఓ సినిమా డైలాగ్. దీన్నే తూచా తప్పకుండా పాటించేస్తున్నారు జెన్ ఆల్ఫా, బీటాలు. రోజు రోజుకో కొత్త పదాన్ని సృష్టిస్తూ తెగ హడావుడి చేస్తున్నారు. ఇలా పుట్టిన పదమే 67. ఈ ఏడాది మొత్తం ఈ పదాన్ని జెన్ ఆల్ఫా, టీనేజ్ ఎక్కువగా వాడారు. అందుకే దీన్ని ప్రముఖ ఆన్ లైన్ డిక్షనరీ వెబ్ సైట్ డిక్షనరీ .కామ్ 67 ను వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా ప్రకటించింది. 67...దీన్ని సిక్సటీసెవెన్అనిచదవకూడాదు. సిక్స్ సెవెన్ అని మాత్రమే చదవాలి. దీనికి అర్థం ఏంటి అంటే ఎవరూ కచ్చితంగా చెప్పలేరు.  నిజానికి సరైన అర్థమే లేదు. ఊరికే సిక్స్ సెవెన్ అంటూ అలా వాడేస్తున్నారు. దీనిని నిర్వచిండంఅసాధ్యమి డిక్షనరీ. కామ్ నే చెప్పేసింది. ఇది కేవలం రెడు చేతులతో చేసే సంజ్ఞ మాత్రమే. అమెరికా ర్యాపర్స్క్రిల్లా పాడిన డ్రిల్ సాంగ్‌ “DootDoot (6 7)” నుంచి ఈ పదం ఉద్భవించిందని భావిస్తున్నట్లు తెలిపింది. ఆ పాటమొత్తం ‘67’ హుక్ వర్డ్‌గా వినిపిస్తూనే ఉంటుంది.

కిస్క్యామ్ గందరగోళం..

సోషల్ మీడియా యుగంలో ఒక చిన్న పొరపాటు లేదా అనుకోని క్షణం ఒఖ వ్యక్తి జీవితాన్ని ఎంతలాతలకిందులుచేయగలదో చెప్పడానికి ఇటీవలి ‘కిస్క్యామ్ఘటనే నిదర్శనం. వేలాది మంది వచ్చే కోల్డ్ప్లేకన్సర్ట్ లో సరదాగాసాగేకిస్క్యామ్ఈసారివివాదానికికేంద్రబిందువైంది. కన్సర్ట్ సందర్భంగా స్టేడియం జంబోట్రాన్‌లో "కిస్క్యామ్" సెగ్మెంట్ సమయంలో, ప్రేక్షకులలో ఉన్న జంటలపై కెమెరా ఫోకస్ చేస్తుంది. ఇలా ఓ జంటపై ఫోకస్ చేసింది. కోల్డ్‌ప్లే కాన్సర్ట్ జోరుగా సాగుతున్న సమయంలో వయసులో కాస్త పెద్దగా ఉన్న జంట మైమరిచిపోయి ఆస్వాదిస్తున్నారు. లైటింగ్వేసేవాళ్లు..కెమెరామెన్ ఒక్క సారి ఆ జంటకు హైలెట్ చేశారు. అయితే ఇది కాస్తా వైల్ అయింది. ఎందుకంటే అక్కడ కనిపించింది ఆస్ట్రోనమర్ కంపెనీ CEO అయిన ఆండీ బైరన్ . ఆయనతో పాటూ ఉన్నది భార్య అయితే ఏ ప్రాబ్లెమ్ ఉండేది కాదు. కానీ క్యామ్ లో కనిపించింది ఆయన లవర్ అదే కంపెనీలో చీఫ్ పీపుల్ ఆఫీసర్ క్రిస్టిన్ కాబట్‌. దీంతో బైరన్, కాబట్‌ల మధ్య జరుగుతున్న వ్యవహారం బట్టబయలైంది. ఇద్దరికీ వేరు వేరు కుటుంబాలు ఉండడంతో విషయం కాస్తా రచ్చ ర్చ అయింది. సోషల్ మీడియాలో అయితే వైరల్కంటే పెద్ద పదం ఏదైనా ఉంటే అదే అయిందని చెప్పవచ్చును. దీంతో బైరన్, కాబట్‌ ఇద్దరి జీవితాలూ తల్లకిందులు అయ్యాయి.

Advertisment
తాజా కథనాలు