Blood Test: బ్లడ్ టెస్ట్ తో డెత్ డేట్ తెలుసుకోవచ్చా.. షాకింగ్ స్టడీ!

మానవ శరీరంలో ఏ సమస్య ఉందో రక్త పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చును. కానీ ఇప్పుడు అదే బ్లడ్ టెస్ట్ తో మరణాన్ని కూడా అంచనా వేయొచ్చని చెబుతున్నారు. యూకేలోని సర్రే యూనివర్శిటి పరిశోధకులు దీనిపై ఓ కొత్త నివేదికను సమర్పించారు.

New Update
blood test

ప్రస్తుతం మానులకు ఉన్న ఒకే ఒక పెద్ద టార్గెట్ ఆరోగ్యంగా ఉండడం. కోవిడ్(covid-19) వచ్చి వెళ్ళిన తర్వాత దాదాపు అందరికీ తమ శరీరం, ఆరోగ్యాలపై శ్రద్ధ ఏర్పడింది. మరణ భయాన్ని కళ్ళ ముందు చూశాక...ఎందుకు అందరూ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలో తెలుసుకున్నారు. అంతకు ముందు వరకూ డబ్బు సంపాదన, కెరీర్ గోల్స్ అంటూ పరుగెట్టిన మనుషులు ఇప్పుడు ఆరోగ్యంగా ఉండడం, బతికి ఉండడ కోసం తాపత్రయం పడుతున్నారు. దానికితోడు ప్రస్తుతం వైద్య రంగంలో కూడా విపరీతమైన టెక్నాలజీ పెరిగిపోయింది. ఏ జబ్బుకైనా మందులు కనిపెట్టేస్తున్నారు. ఆఖరుకి క్యాన్సర్ కు కూడా మందును కనిపెట్టేశారు.

Also Read :  అట్టుడుకుతున్న బంగ్లాదేశ్..భారత్ తో పెరుగుతున్న దూరం

రక్తంలో ప్రొటీన్లు చెప్పే రహస్యం..

ఇంత అభివృద్ధి చెందిన వైద్య రంగం ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటి వరకు జబ్బులను కనిపెట్టడం, వాటికి మందులను తయారు చేయడం వంటివి చేసిన పరిశోధకులు ఇప్పుడు ఏకంగా మానవుని మరణం అంచనా వేసే స్థాయికి ఎదిగారు. అది కూడా బ్లడ్ టెస్ట్(Blood Tests) ద్వారా. యూకేలోనిసర్రే యూనివర్శిటీ శాస్త్రవేత్తలు దీనిపై రిశోధనలు చేశారు. అందులో వారు కనుగొన్నదిఏంటంటే.. రక్తంలో ఉన్న కొన్ని ప్రోటీన్లు భవిష్యత్తులో తీవ్రమైన వ్యాధులు మరియు మరణ ప్రమాదాన్ని అంచనా వేయగలవని చెబుతున్నారు. 39 నుంచి 70 ఏళ్ళ వయసు ఉన్న 38 వేల మంది వ్యక్తుల రక్త నమూనాలను పరీక్షించి మరీ ఈ విషయాన్ని కనుగొన్నారు. దీని కోసం ఎన్నో ఏళ్ళు కష్టపడ్డారు. ఈ రిసెర్చ్ లో ప్రతి రక్త నమూనాలో ఉన్న సుమారు 3,000 ప్రోటీన్లను పరిశీలించి, 5 లేదా 10 సంవత్సరాలలోపు ప్రమాదవశాత్తు కాని మరణానికి ఏ ప్రోటీన్ స్థాయిలుకారణమవుతాయో పరిశీలించారు. వయసు, బీఎమ్ఐ, చెడు అవాట్లు వంటివి కూడా ప్రమాణంలోకి తీసుకుంటూనే రక్తంలోని ప్రోటీన్లు క్యాన్సర్(cancer), గుండెజబ్బు(Heart problems)...ఇతర జబ్బుల నుంచి మరణానికి కారణమవుతాయని ఆవిష్కరించారు. 

అయితే ఈ ప్రోటీన్ల(protiens) పరీక్ష మరణ(death) సమయాన్ని నిర్ణయించదని పరిశోధకులు స్పష్టం చేశారు. దీనిని ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా చూడాలని అన్నారు. ఇవి అనారోగాలను సకాలంలో గుర్తించడం , నివారణకు వీలు కల్పిస్తుందని చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, తదుపరి అధ్యయనాలలో ఫలితాలు దృఢంగా ఉంటే, ఇటువంటి రక్త పరీక్షలు భవిష్యత్తులో వైద్యులు రోగులను నిశితంగా పర్యవేక్షించడానికి, సకాలంలో స్క్రీనింగ్ అందించడానికి, జీవనశైలి మార్పులను సిఫార్సు చేయడానికి సహాయపడతాయి.

Also Read :  దుబాయ్ ను మళ్ళీ భయపెడుతున్న వర్షాలు..పలు నగరాల్లో రెడ్ అలెర్ట్

Advertisment
తాజా కథనాలు