భారతీయ శరణార్థులకు బిగ్ షాక్.. వెనక్కి పంపించేస్తున్న యూరప్

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అక్రమ వలసదారులను వెనక్కి పంపిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు యూరప్‌ కూడా అమెరికా బాటలోనే నడుస్తోంది. భారత్‌తో సహా ఏడు దేశాల నుంచి వచ్చే శరణార్థుల అభ్యర్థనలను తక్కువగా తీసుకోవాలని నిర్ణయించింది.

New Update
EU to slash asylum cases from 7 nations deemed safe

EU to slash asylum cases from 7 nations deemed safe

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అక్రమ వలసదారులను వెనక్కి పంపిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు యూరప్‌ కూడా అమెరికా బాటలోనే నడుస్తోంది. భారత్‌తో సహా ఏడు దేశాల నుంచి వచ్చే శరణార్థుల అభ్యర్థనలను తక్కువగా తీసుకోవాలని నిర్ణయించింది. ఈ లిస్ట్‌లో భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌, ఈజిప్ట్, మొరాకో, కొలంబియా, ట్యునీషియా, కొసావో ఉన్నాయి. ఈ ఏడు దేశాలను సురక్షిత దేశాలుగా పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. యూరోపియన్ యూనియన్ తీసుకున్న ఈ నిర్ణయంపై మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 

Also Read: ఆంధ్రాతీరం భారత్‌కు బంగారు గని.. దేశ భవిష్యత్ అంతా ఇక్కడే!

విచక్షణారహిత హింస జరగని దేశాలను తాము సురక్షిత దేశాలుగా భావిస్తున్నామని యూరప్ ప్రకటించింది. దీనిపై యూరప్‌ పార్లమెంట్, యూరోపియన్ కౌన్సిల్ మధ్య ఒప్పందం కూడా జరిగింది. అయితే ఈ రూల్‌ తమకు వర్తించదని దరఖాస్తుదారులు నిరూపించుకోవాలి. 2026 జూన్‌ నుంచి ఈ ఒప్పందం అమల్లోకి రానుంది. దీన్ని ఇతర దేశాలకు కూడా విస్తరించనున్నారు. ఇది అమల్లోకి వచ్చాక ఆయా దేశాలు సురక్షితమని భావిస్తే తిరిగి శరణార్థులను వాళ్ల దేశాలకు పంపించే ఛాన్స్ ఉంటుంది. అయితే శారీరక హింసకు గురయ్యే ప్రమాదం ఉన్నవాళ్లని మాత్రం తిరిగి వాళ్ల దేశాలకు పంపించకుండా మినహాయింపు ఇవ్వనున్నారు.   

Also Read: జనవరిలోనే మున్సిపల్ ఎన్నికలు.. BC రిజర్వేషన్‌పై రేవంత్ సర్కార్ ప్లాన్ ఇదే!

మరోవైపు ట్రంప్ ప్రభుత్వం కూడా శరణార్థులకు ఇచ్చే వర్క్‌ పర్మిట్‌ కాలవ్యవధిని కుదిస్తున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్‌ (USCIS) ఇటీవల ప్రకటించింది. శరణార్థులు, ఆశ్రయం పొందాలనుకునేవాళ్లు, గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్నవాళ్లకి అమెరికాలో ఉద్యోగం చేసుకునేవాళ్ల కోసం ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ కార్డ్ కింద పర్మిషన్లు జారీ చేస్తారు. దీనికి అయిదేళ్ల వరకు కాలవ్యవధి ఉండగా పలు సవరణలతో దాన్ని కేవలం 18 నెలలకు మాత్రమే కుదించారు. భద్రతా కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు USCIS తెలిపింది. 

Advertisment
తాజా కథనాలు