Bangladesh: షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టిన యువ నేత మృతి.. అట్టుడుకుతున్న బంగ్లాదేశ్

బంగ్లాదేశ్‌ విద్యార్థి ఉద్యమ నాయకుడు, ఇంకిలాంబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్‌ ఉస్మాన్‌ బిన్‌ హదీ (32) మృతితో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడంలో ఇతడు కీలక పాత్ర పోషించాడు. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Bangladesh student protests leader Osman Hadi dies in a Singapore hospital

Bangladesh student protests leader Osman Hadi dies in a Singapore hospital

బంగ్లాదేశ్‌ విద్యార్థి ఉద్యమ నాయకుడు, ఇంకిలాంబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్‌ ఉస్మాన్‌ బిన్‌ హదీ (32) మృతితో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడంలో ఇతడు కీలక పాత్ర పోషించాడు. బిన్ హదీ మృతితో పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. డిసెంబర్ 12న ఢాకాలో బీజోయ్‌నగర్‌ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం ముగించుకుని వస్తుండగా పలువురు దుండగులు బిన్‌ హదీపై కాల్పులు జరిపారు. అతడికి తీవ్ర గాయాలు కావడంతో బంగ్లాదేశ్‌ ప్రభుత్వం సింగపూర్‌కు పంపించింది. అక్కడ ఆరు రోజుల పాటు చికిత్స తీసుకున్న అతడు గురువారం ప్రాణాలు కోల్పోయాడు. 

Also Read: ఆంధ్రాతీరం భారత్‌కు బంగారు గని.. దేశ భవిష్యత్ అంతా ఇక్కడే!

హదీ మరణవార్తతో బంగ్లాదేశ్‌వ్యాప్తంగా అల్లర్లు మొదలయ్యాయి. నిరసనాకారులు అవామీ లీగ్‌ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఢాకాలో ప్రముఖ వార్తాపత్రికలు ఫ్రథమ్‌ ఆలో, ది డైలీ స్టార్ కార్యాలయాలపై దాడులు చేసి నిప్పంటించారు. చిట్టగాంగ్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం వెలుపల కూడా నిరసనాకారులు భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హదీ హత్య వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉందని వాళ్లు ఆరోపణలు చేస్తున్నారు.  

బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్‌.. హదీ మరణానికి సంతాపం తెలిపారు. శనివారం దేశవ్యాప్తంగా జాతీయ సంతాప దినంగా ప్రకటించారు. నిరసనాకారులు శాంతిని పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని కోరారు. మరోవైపు ఢాకాతో పాటు ఇతర ప్రధాన నగరాల్లో భద్రత బలగాలను భారీగా మోహరించారు. ప్రస్తుతం బంగ్లాలో నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ స్పందించింది. అక్కడ ఉన్న భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. 

ఉస్మాన్‌ బిన్ హదీ ఎవరు ? 

హదీ 1993 జూన్ 30న ఝలకతి జిల్లాలో జన్మించారు. ఢాకా విశ్వవిద్యాలయంలో ఆయన పొలిటికల్ సైన్స్‌ చదివారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా ఈయన గళం వినిపించేవాడు. అలాగే  బంగ్లాదేశ్ సార్వభౌమాధికారంపై విదేశీ శక్తుల ప్రభావం ఉండకూడదని పోరాడేవాడు. ఇక షేక్ హసీనా ప్రభుత్వం పతనానికి దారితీసిన ఉద్యమంలో హదీ కీలక పాత్ర పోషించారు. హసీనా ప్రభుత్వం కూలిపోయిన అనంతరం ఇంకిలాబ్ మంచ్ అనే రాజకీయ వేదికకు ఆయన కన్వీనర్‌గా, అధికార ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించారు. 

Also Read: మంచు కురవట్లేదని.. టూరిస్టుల కోసం ఏం చేశారో తెలుసా?

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. హదీ స్వతంత్ర్య అభ్యర్థిగా ఢాకా-8 నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే డిసెంబర్ 12న మధ్యాహ్నం ఢాకాలోని పురానా పల్టన్ ప్రాంతంలో మసీదులో ప్రార్థనలు ముగించుకుని ఓ ఆటోలో వెళ్తుండగా దుండగులు కాల్పులు జరిపారు. దీంతో అక్కడున్నవారు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం అక్కడి ప్రభుత్వం సింగపూర్‌కు పంపించింది. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స తీసుకుంటూ గురువారం అతడు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. మృతులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. 

Advertisment
తాజా కథనాలు