🔴Live News Updates: జూన్ 2న కొత్త విధానం.. మంత్రి పొంగులేటి శుభవార్త!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
4దశాబ్దాలుగా ఉగ్రవాదదాడుల్లో 20వేలకుపైగా భారతీయులు మరణించారని భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ అన్నారు. పాకిస్తాన్ తీరుపై ఐక్యరాజ్యసమితిలో ఆయన నిప్పులు చెరిగారు. టెర్రరిజానికి పాకిస్తాన్ వరల్డ్ సెంటర్‌గా ఉందని హరీశ్ ఆరోపించారు.
భారత్ భూబాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ వ్యక్తిని ఇండియన్ BSF కాల్చి చంపింది. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి గుజరాత్ లోని బనస్కాంత్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని భద్రతా బలగాలు ప్రకటించాయి.
హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీ నుంచి ఇంగ్లాండ్ యువతి తప్పుకున్నారు. మొదట మిల్లా మాగీ వ్యక్తిగత కారణాలతో పోటీలో పాల్గొనలేదని అనుకున్నారు. తర్వాత ఆమె ఓ ఇంటర్వ్యూలో అసలు కారణాలు చెప్పింది. మిస్ వరల్డ్ 2025లో ఆమెను వేశ్యలా చూశారని బాధపడింది.
శాంసంగ్‌తో పాటు మిగతా స్మార్ట్ఫోన్లకు 25 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. శాంసంగ్‌తో పాటు మిగతా కంపెనీ ఉత్పత్తులను కూడా అమెరికాలోనే తయారు చేయాలి. లేకపోతే టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించారు.
ఇజ్రాయెల్ దాడులతో గాజాలోని వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇజ్రాయెల్ ఎంపీ ఐమన్ ఒడె అక్కడి పార్లమెంటులో దీనిగురించి మాట్లాడారు. ఏడాదిన్నరగా గాజాలో మీరు 19 వేల చిన్నారుల ప్రాణాలు తీశారని విమర్శించారు.
మయన్మార్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అక్కడి తీరంలో రెండు ఓడలు మునిగిపోయాయి. ఈ ఘటనలో 427 మంది రోహింగ్యాలు మృతి చెందినట్లు తెలుస్తోంది. మే 9,10వ తేదీల్లో ఈ ఘోర ప్రమాదాలు జరిగాయని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది.
జర్మనీలోని హామ్‌బర్గ్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో దారుణం జరిగింది. అక్కడ రైలు కోసం నిల్చున్న వారిపై ఓ దుండుగురాలు కత్తితో దాడి చేసింది. దీంతో 17 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.