/rtv/media/media_files/2025/05/24/tRbaOn96zGlht7ZyBlrA.jpg)
పాకిస్తాన్ తీరుపై ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ నిప్పులు చెరిగారు. నాలుగు అంశాలు హైలెట్ చేస్తూ హరీశ్ పాకిస్తాన్‌ని ఐక్యరాజ్యసమితిలో నిలదీశారు. పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఆయన చెప్పారు. టెర్రరిజానికి పాకిస్తాన్ వరల్డ్ సెంటర్‌గా ఉందని ఆరోపించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధు జలాల ఒప్పందం నిలిపివేయబడినందున పాకిస్తాన్ తప్పుడు సమాచారం చేస్తోందని శనివారం UNOలో మాట్లాడారు. పాకిస్తాన్ ప్రతినిధి ఐక్యరాజ్యసమితిలో ఒప్పంద అంశాన్ని లేవనెత్తారు. దానికి సమాధానంగా నీరు ప్రాణం, యుద్ధ ఆయుధం కాదని ఆయన స్పందించారు.
Also Read : రేవంత్, స్టాలిన్, చంద్రబాబుతో ప్రధాని నవ్వులే నవ్వులు
Also Read : మీకో దండంరా బాబు.. టాలీవుడ్ పై పవన్ ఫైర్!
India Blasts Pakistan At UNO
1960లో సంతకం చేసిన సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం ఏప్రిల్ 23న నిలిపివేసింది. గత 4 దశాబ్దాలుగా ఉగ్రవాద దాడుల్లో 20వేల మందికి పైగా భారతీయులు మరణించారని హరీష్ అన్నారు. ఆరున్నర దశాబ్దాలుగా పాకిస్తాన్ భారతదేశంపై 3 యుద్ధాలు, వేలాది ఉగ్రవాద దాడులు ప్రేరేపించిందని హరీశ్ అన్నారు. 2012లో జమ్మూ కాశ్మీర్‌లోని తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టుపై కూడా ఉగ్రవాదులు దాడి చేశారని హరీష్ అన్నారు.
Also Read : మీకసలు మానవత్వం ఉందా?: వంశీని చంపేస్తారా?: పేర్ని నాని ఎమోషనల్!
Also Read : పాకిస్తాన్ ఉగ్రదాడుల్లో 20 వేల మంది భారతీయులు మృతి
India Permanent Representative to the UN