Miss World 2025: మిస్ వరల్డ్ పోటీ నుంచి తప్పుకున్న మిస్ ఇంగ్లాండ్‌.. వేశ్యలా చూశారన్న బాధతో!!

హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీ నుంచి ఇంగ్లాండ్ యువతి తప్పుకున్నారు. మొదట మిల్లా మాగీ వ్యక్తిగత కారణాలతో పోటీలో పాల్గొనలేదని అనుకున్నారు. తర్వాత ఆమె ఓ ఇంటర్వ్యూలో అసలు కారణాలు చెప్పింది. మిస్ వరల్డ్ 2025లో ఆమెను వేశ్యలా చూశారని బాధపడింది.

New Update
Miss World 2025 123

హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల నుంచి ఇంగ్లాండ్ యువతి తప్పుకున్నారు. మొదట్లో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ వ్యక్తిగత కారణాల వల్ల పోటీలో పాల్గొనలేదని అనుకున్నారు. తర్వాత ఆమె ఓ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ అసలు కారణాలు బటయపెట్టింది. మిల్లా మాగీ మనస్తాపంతో హైదరాబాద్ మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలో నుంచి వెళ్లిపోయారు. అందాల పోటీలో నన్ను వేశ్యలా చూశారని ఆమె గోడు వెల్లబోసుకున్నారు. ఆమెతో కొందరు అగౌరవంగా ప్రవర్తించారని చెప్పుకొచ్చింది. 

Also Read :  వీరు పొరపాటున తాటిముంజులు తిన్నారో.. పైకి పోవడం గ్యారెంటీ

Miss England Milla Magee Quits Miss World 2025

Also Read :  నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు తుపాను ముప్పు

Also Read :  భార్య చీర కట్టుకొని పురుషులతో డాక్టర్ శృంగారం.. ఆ వీడియోలు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు

హైదరాబాద్‌లో 72వ మిస్ వరల్డ్ పోటీలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు మిస్ వరల్డ్ పోటీలు కీలక దశకు చేరుకున్నాయి. తాజాగా హెడ్-టు-హెడ్ ఛాలెంజ్ గ్రాండ్ ఫినాలే హైదరాబాద్‌లోని ట్రైడెంట్‌ హోటల్లో ఘనంగా జరిగాయి. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కోసం 20 మంది కంటెస్టెంట్స్‌ ఎంపిక అయ్యారు. యూరప్, ఆఫ్రికా, ఆసియా, అమెరికా అండ్ కరేబియన్ ఖండాల నుంచి 20 మంది కంటెస్టెంట్స్ హెడ్-టు-హెడ్ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఈ నెల 31న గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. ఆ రోజే ప్రపంచ విన్నర్‌ను ప్రకటిస్తారు. మిస్ వరల్డ్ హెడ్-టు-హెడ్ ఛాలెంజ్ ఫైనల్ నుంచి మిస్ ఇండియా నందిని గుప్తాకు చోటు దక్కలేదు.

Also Read :  మరో కంపెనీకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. ఈ దేశాల్లో తయారు చేస్తే సుంకం తప్పదు

miss world 2025 | Miss World 2025 Contest | Miss World 2025 hyderabad | Miss England Milla Magee | latest-telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు